యూడీఐడీ నమోదు చేసుకోవాలి
కామారెడ్డి అర్బన్: జిల్లాలోని దివ్యాంగులందరు సదరం యూడీఐడీ నమోదు చేసుకోవాలని డీఆర్‌డీవో సురేందర్ సూచించారు. బుధవారం కామారెడ్డి డివిజన్‌లోని మీ సేవ అపరేటర్లు, డీఆర్‌డీవో సిబ్బందికి దీనిపై అవగాహన కల్పించారు. అదనపు డీఆర్‌డీవో విజయలక్ష్మి యూడీఐడీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వివరించారు. ఈడీఎం ప్రవీణ్, డీపీఎం సురేష్‌కుమార్, అపరేటర్లు విజయ, సంధ్య, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లా కు చెందిన సీనియర్ న్యాయవాది బండారి సురేందర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర లా మినిస్ట్రీ అండ్ జస్టిస్ విభాగం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. లింగాపూర్ గ్రామానికి చెందిన సురేందర్‌రెడ్డి 16 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. తన నియామ కానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ రామారావు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి టౌన్: యువతులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ నాగేశ్వరరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేష న్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రథమ్ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతుల కోసం 60 రోజుల పాటు ఉచితంగా వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందించి, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నా రు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీజీఎం శాలిని, ప్రథమ్ ఎన్జీవో స్టేట్ హెడ్ హనుమంత్, ఫౌండర్ మెంబర్ నయాబ్ రసూల్, ప్రాజెక్ట్ హెడ్ ప్రణయ్ చందర్, మేనేజర్లు రంగారావు, రాజు పాల్గొన్నారు.
నిజాంసాగర్: నాగమడుగు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన సమగ్ర సమాచారంతోపాటు అవసరమయ్యే భూముల వివరాలను తమకు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం ఒడ్డేపల్లి గ్రామ పంచాయతీలో బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో నాగమడుగు భూనిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. పంపుహౌస్‌తో పాటు పైపులైన్లకోసం భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో పూర్తి సమాచారం తెప్పిస్తామని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు సహకరించాలని కోరారు. సమావేశంలో సర్పంచ్ అంజయ్య, నాయకులు ప్రజాపండరి పాల్గొన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాల య పరిధిలోని పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల పరీక్షల ఫీజు జనవరి 5లోగా చెల్లించాలని కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్‌కుమార్ తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో జనవరి 7వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పీజీ(ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎమ్మెస్సీ, ఎంకాం) ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్(ఏపీఈ) అన్ని సబ్జెక్టులకు రూ. 500, ఐపీసీహెచ్ (అన్ని సబ్జెక్టులకు రూ. 600) ఎంబీఏ, ఐఎంబీఏ, ఎంసీఏ అన్ని సబ్జెక్టులకు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు వెబ్‌సైట్ www.telanganauniversity.ac.inను సంప్రదించాలని సూచించారు.
యూడీఐడీ నమోదు చేసుకోవాలి
యూడీఐడీ నమోదు చేసుకోవాలి
యూడీఐడీ నమోదు చేసుకోవాలి


