చిక్కిన ప్రధాన అంతర్రాష్ట్ర ముఠాలు..
జిల్లా పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు ప్రధాన అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకున్నారు.
● సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా నకిలీ కరెన్సీ దందా నిర్వహిస్తున్న ముఠాను గుర్తించి పశ్చిమ బెంగాల్, యూపీ, బిహార్, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్రలలో ఏకకాలంలో దాడులు చేసి 13 మంది ముఠాను అరెస్ట్ చేశారు. భారీగా నకిలీ కరెన్సీ, నగదు, నేరానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 8 మందిపై పీడీ యాక్ట్ అమలు చేశారు.
● జిల్లాలోని జాతీయ రహదారుల వెంట జరిగిన 9 దోపిడీ కేసులను సమగ్రంగా దర్యాప్తు చేసి ఓ పార్ధీ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో నలుగురిపై పీడీ యాక్టు పెట్టారు.
● కొంతకాలంగా జాతీయ రహదారులపై నిలిపిన వాహనదారులపై దాడులు, దగ్గర్లో ని గ్రామాల్లో ఇళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన నలుగురు నిందితులు గల మరో పార్ధీ ముఠాను గాంధారి పోలీసులు అరెస్ట్ చేశారు.
● భిక్కనూరు మండలం అంతంపల్లి, తలమడ్ల గ్రామ శివార్లలో దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడిన కంజర్ భట్ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 15.45 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
● ఐదేళ్లుగా తాడ్వాయి, గాంధారి, లింగంపేట్, రాజంపేట్, బాన్సువాడ పీఎస్‌ల పరిధిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న గడ్డపార గ్యాంగ్‌లోని ఐదుగురిని అరెస్ట్ చేశారు.
● సోషల్ మీడియా యాప్‌ల ద్వారా అమాయకులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురు సభ్యుల గే గ్యాంగ్‌ను కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా కామారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తొమ్మిది నేరాలకు పాల్పడింది.


