సేవలు అంతంత మాత్రమే
వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలి
నస్రుల్లాబాద్: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్‌సీ) నూతనంగా ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన తర్వాత మండల ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో నూతన మండలాల్లో భవనాన్ని ఏర్పాటు చేశారు. అందులో డిప్యూటేషన్ ద్వారా సిబ్బందిని కేటాయించారు. కాని ఉదయం నుంచి సాయత్రం వరకు మాత్రమే ఆస్పత్రి తెరిచి ఉంచి మూసి వేయడంతో ప్రథమ చికిత్స కోసం బాన్సువాడ ఏరియా ఆస్పత్రిని ఆశ్రయించాల్సి వస్తోంది. అన్ని హంగులతో ఏర్పడిన ఆస్పత్రిలో సేవలు అంతంత మాత్రమే ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
తప్పని వ్యాక్సినేషన్ ఇబ్బందులు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి వారం మండలంలోని నెమ్లి, దుర్కి, నస్రుల్లాబాద్, అంకోల్‌తండా ఆరోగ్య ఉప కేంద్రాల్లో చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుంది. భవిష్యత్తులో కొన్నిరకాల వ్యాధులు రాకుండా టీకాలు ఇస్తారు. దీనికి అవసరమైన మెడికల్ వస్తువులను బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి తీసుకుని వస్తారు. అయితే నస్రుల్లాబాద్‌లో పీహెచ్‌సీ ఏర్పాటైనా బీర్కూర్ వెళ్లక తప్పడం లేదు. స్థానికంగా వాక్సిన్లు ఉంచకపోవడంతో అక్కడికే వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని సిబ్బంది చెబుతున్నారు.
నస్రుల్లాబాద్ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం
కోతులు, కుక్కల బెడద ఎక్కువ..
నస్రుల్లాబాద్ మండల వ్యాప్తంగా కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. నిత్యం ఏదో గ్రామం నుంచి కోతి, కుక్క కాటు గాయాల బారిన పడుతున్నారు. వాక్సిన్ తీసుకుందామని నస్రుల్లాబాద్ ఆస్పత్రికి వెళ్తే అక్కడ అందుబాటులో వ్యాక్సిన్లు లేవని బాన్సువాడ లేదా బీర్కూర్ వెళ్లాలంటూ సిబ్బంది చెబుతున్నారు. పీహెచ్‌సీ ఏర్పాటైనా సరైన వైద్యం అందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కోతి, కుక్క, పాము కాటు మందులు నస్రుల్లాబాద్ పీహెచ్‌సీలో అందుబాటులో ఉంచాలి. ఎంత ధనవంతు డు అయినా వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ దవాఖానాకే రావా ల్సి ఉంటుంది. కాని అక్కడే లేదంటే ఇబ్బంది అవుతుంది. అధికారులు స్పందించి వాక్సిన్ స్టోరేజీ చేసేలా ఏర్పాట్లు చేయాలి.
– రాము, మైలారం
కోతి, కుక్క కాటులకు వాక్సిన్
కోసం నస్రుల్లాబాద్ నుంచి
బాన్సువాడ వెళ్లాల్సిందే
అవస్థలు పడుతున్న గర్భిణులు,
బాలింతలు
సేవలు మెరుగుపర్చాలని
ప్రజల వేడుకోలు
సేవలు అంతంత మాత్రమే


