మహిళ మృతదేహం లభ్యం
వర్ని: మండలంలోని పొట్టిగుట్ట శివారులోగల నిజాంసాగర్ ప్రధాన కాలువలో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం కాలువ నీటి ప్రవాహంలో మహిళ మృతదేహం కొట్టుకురాగా, స్థానిక రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు.
నవీపేట: మండలంలోని యంచ గోదావరి నదిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన మిర్యాల పవన్‌కుమార్(22) అనే యువకుడు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈనెల 22న ఆర్మూర్‌కు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి, బయటకు వెళ్లాడు. అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో 23న అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యంచ గోదావరిలో గురువారం ఉదయం పవన్ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: భార్య మరొక వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని భర్త రోడ్డెక్కి ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా..ఆర్మూర్‌కు చెందిన ప్రశాంత్‌కు ఈ ఏడాది ఆగస్టులో కోరుట్ల ప్రాంతానికి చెందిన యువతితో వివాహం జరిగింది. కొన్ని రోజులకే తన భార్య బావ వరుసైన నిజామాబాద్‌కు చెందిన లింబాద్రి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించాడు. దీంతో తాను భార్య వల్ల మోసపోయానని కొంతకాలంగా వాట్సప్ స్టేటస్ పెడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులను కూడా ఆశ్రయించాడు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో గురువారం వినాయక్ నగర్‌లోని లింబాద్రి ఇంటి ముందు ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు, పెద్దలు వచ్చి తనకు న్యాయం చేయాలి అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. నా తప్పు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి అని ప్రశాంత్ ఫ్లెక్సీలో పేర్కొన్నాడు. భార్య వివాహేతర సంబంధాన్ని గుర్తించి వినూత్న రీతిలో భర్త నిరసనకు దిగడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
మహిళ మృతదేహం లభ్యం


