లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ఓం ప్రకాష్ 38 మందికి పరీక్షలు చేశారు. ఏడుగురికి మోతిబిందు ఉన్నట్లు గుర్తించి వారిని బోధన్ లయన్స్ క్లబ్ కంటి ఆస్పత్రికి సిఫారసు చేశారు. లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రాజు, సభ్యులు జగదీష్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజీవాడి చౌరస్తాలో గాంధారి నుంచి బాన్సువాడకు వెళ్లే ప్రధాన రహదారిపై భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా నీరు వృథాగా పోతోంది. దీంతో వాహనాలు, రోడ్డు వెంబడి నడిచే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రి రక్త నిధి, రెడ్ క్రాస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆయప్ప ఆలయ కమిటీ పిలుపు మేరకు మాలధారణలో ఉన్న పలువురు అయ్యప్ప స్వాములు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. వారితో పాటు పలువురు భక్తులు రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సభ్యుడు వేణుగోపాల్ మాట్లాడుతూ.. రక్తం ప్రాణదానంతో సమానమని, యువత అధిక సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావాలని కోరారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): బోనాల్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు గురువారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దివిటి రమేశ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం బోనాల్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాజాగౌడ్, అలాగే కొర్పోల్ గ్రామ కమిటీ అధ్యక్షుడుగా బ్యాగరి సాయిలును ఎన్నుకున్నట్లు తెలిపారు. నాయకులు గన్నూనాయక్, విఠల్, రూప్‌సింగ్, గాండ్ల నర్సింలు, సాయాగౌడ్, బండి నర్సింలు, శ్రీకాంత్, శ్రీనివాస్, పర్వయ్య తదితరులు పాల్గొన్నారు.
లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు
లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు


