డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి
సుభాష్‌నగర్: అక్రెడిటేషన్ కార్డుల విషయంలో జర్నలిస్టులను విభజించే కుట్రను ముక్త కంఠంతో ఖండిస్తున్నామని డెస్క్ జర్నలిస్టులు పేర్కొన్నారు. మీడియా కార్డుల పేరుతో తమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమన్నారు. ఈమేరకు గురువారం జిల్లా కేంద్రంలో డెస్క్ జర్నలిస్టులు సమావేశమయ్యారు. నూతన అక్రెడిటేషన్ల జారీ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్– 252పై చర్చించారు. జర్నలిస్టులను విభజించేలా, డెస్క్ జర్నలిస్టులకు అన్యా యం చేసేలా ఉన్న జీవోను వెంటనే రద్దు చేయా లని డిమాండ్ చేశారు. డెస్క్ జర్నలిస్టులందరికీ పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్లు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 27న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
అడ్‌హక్ కమిటీ..
డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా సీహెచ్ భీంరావు, కో కన్వీనర్లుగా కామిరెడ్డి అశోక్‌రెడ్డి, బి. సందీప్,ఏ. నరేంద్ర స్వామి, కె. రాకేష్, జి.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎడిషన్, బ్యూరో ఇన్‌చార్జులు గౌరవ సలహాదారులుగా వ్యవహరించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు.


