చంద్రబాబుకు భయం పట్టుకుంది! | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు భయం పట్టుకుంది!

Aug 9 2026 1:46 AM | Updated on Aug 9 2026 1:46 AM

పిఠాపురం రూరల్‌ ఎఫ్‌కే పాలెంలో నిర్వహించిన

రిలే దీక్షల్లో మాజీ ఎంపీ

వంగా గీత తదితరులు

జగ్గంపేటలో రిలే దీక్షల్లో మాజీ మంత్రి తోట నరసింహం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురాం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తేలడంతోనే సీబీఐ దర్యాప్తునకు చంద్రబాబు వెనుకంజ వేస్తున్నారు.. అసలు నిజాన్ని దాచేందుకే సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.. లోకేశ్‌ మంత్రి పదవిని కాపాడే పనిలో బాబు ఉన్నారని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు మండి పడుతున్నారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేసిన కూటమి ప్రభుత్వంపై ఉద్యమం ఉధృతం చేశారు. దశల వారీ ఆందోళనల్లో భాగంగా శనివారంతో రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. కాకినాడ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, పార్టీ శ్రేణులు, అభ్యర్థులు దీక్షల్లో కూర్చున్నారు. కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

లోకేష్‌ బాధ్యత వహించాలి

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని, ప్రతిభకు అన్యాయం చేసి అడ్డదారిలో డీఎస్సీ ఉద్యోగాలను అనర్హులకు కట్టబెట్టిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా డిమాండ్‌ చేశారు. తుని సీఎంఆర్‌ సెంటర్లో డీఎస్సీలో అవకతవకలను నిరసిస్తూ పట్టణ, తుని మండలాలకు సంబంధించి మూడో రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి మాట్లాడుతూ డీఎస్సీలో స్పోర్ట్స్‌, వికలాంగుల కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. డీఎస్సీలో జరిగిన లోపాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన

పిఠాపురం: పిఠాపురం మండలం ఎఫ్‌కే పాలెంలో మూడో రోజు నిరాహార దీక్షలను నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వంగా గీత ప్రారంభించారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన అస్తవ్యస్తంగా మారిందనడానికి డీఎస్సీ నియామకాలు ఓ ఉదాహరణ అని ఆమె అన్నారు. దీక్షలకు వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్‌కుమార్‌ (బన్ని), జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, పిఠాపురం బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు సంఘీభావం తెలిపారు.

మోసం చేయడమే చంద్రబాబు నైజం

పెద్దాపురం: ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని వైఎస్సార్‌ సీపీ పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకుడు నక్కా నగేష్‌ అన్నారు. సామర్లకోటలో నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. డీఎస్సీలో నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్నారు. మూడో రోజు నిరాహార దీక్షకు నియోజకవర్గ కోఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు అధ్యక్షత వహించగా, సీనియర్‌ నాయకుడు దవులూరి సుబ్బారావు, వైయస్సార్‌ సీపీ కాకినాడ జిల్లా పంచాయతీరాజ్‌ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు మోరంపూడి శ్రీరంగనాయకులు, నియోజకవర్గ అధ్యక్షుడు నాగనబోయిన రాజబాబు. జెడ్పీటీసీ గవరసాయన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

కూటమికి చెంపపెట్టు

జగ్గంపేట: డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ చేస్తున్న ఆందోళనలు, రిలే దీక్షలతో కూటమి ప్రభుత్వంలో వణుకు పుడుతోందని, లోకేష్‌ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌ విద్యార్థి సంఘాల నుంచి పెరగడంతో కూటమి నేతలకు చెంపపెట్టులా మారిందని మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి తోట నరసింహం అన్నారు. జగ్గంపేటలో వైఎస్సార్‌ విగ్రహం వద్ద మూడో రోజు నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. గండేపల్లి, కిర్లంపూడి మండలాలకు చెందని పార్టీ నేతలు, విద్యార్థి నేతలు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట శ్రీరాంజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురాం పాల్గొన్నారు.

డీఎస్సీలో అక్రమాల వల్లే సీబీఐ

దర్యాప్తునకు వెనుకంజ

లోకేశ్‌ మంత్రి పదవిని

కాపాడుకునేందుకు పాకులాట

ప్రభుత్వ అక్రమాలపై

వైఎస్సార్‌ సీపీ నిరసన గళం

ఉధృతమవుతున్న

వైఎస్సార్‌ సీపీ ఉద్యమం

రాజరికంలో ఉన్నట్టు..

కాకినాడ రూరల్‌: రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని, చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ రాజరికంలో ఉన్నట్టు భావిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దగా డీఎస్సీపై తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు చేపడుతున్న రిలే దీక్షలకు అనూహ్య స్పందన లభించిందన్నారు. సర్పవరం జంక్షన్‌లో మూడో రోజు రిలే దీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కరప, కాకినాడ రూరల్‌లోని పలు గ్రామాలకు చెందిన వారు దీక్ష చేపట్టి నిరసన తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement