వేలం కేంద్రంలో మాజీ సీఎం జగన్ అడుగుపెడితే పొగాకు ధర పెరుగుతుందని మాకు నమ్మకం. ఇప్పుడదే జరిగింది. 2021–22లోనూ మార్కెట్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. అప్పటి సీఎం వైఎస్ జగన్ రైతుల ఇబ్బందులు తెలుసుకుని మార్క్‌ఫెడ్ ద్వారా 10 మిలియన్ల పొగాకు కొనుగోలు చేసి ఆదుకున్నారు.
– సత్తి సాయిఈశ్వరరెడ్డి, పొగాకు రైతు,
కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం
రైతులకు న్యాయం జరిగింది
జగనన్న వల్లే రైతులకు న్యాయం జరుగుతుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించింది. అప్పట్లో మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేశారు. ఎందుకు పనికి రాని లోగ్రేడుకు రూ.120 ధర ఇచ్చి ఆదుకున్నారు. జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్లు పొగాకుకు మంచి ధర లభించింది. పొగాకు రైతులను టీడీపీ ఎమ్మెల్యే వెంకట్రాజు బ్లేడ్ బ్యాచ్‌గా చెప్పడం మంచి పద్ధతి కాదు.
– చిన్నం నాగార్జున, పొగాకు రైతు, గౌరీపట్నం
వైఎస్సార్ సీపీ పోరాటంతోనే..
పొగాకు రైతులకు అండగా వైఎస్సార్ సీపీ పోరాటం చేసింది. జగనన్న పర్యటన ప్రకటన నుంచి ఇప్పటివరకు కిలోకు రూ.26 పెరిగింది. జగన్ పర్యటన వల్ల రైతులకు ఒరిగింది ఏమీ లేదని చెబుతున్న టీడపీ నాయకులు ఇప్పుడు ఏం చెబుతారు? పొగాకు రైతులకు జగనన్న అండగా నిలిచారు.
– వల్లభనేని సత్యనారాయణ, పొగాకు రైతు,
వెదుళ్లకుంట, గోపాలపురం మండలం
వారెందుకు పట్టించుకోలేదు
పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి నాలుగు నెలలైంది. గిట్టుబా టు ధర లేదని రైతులు గగ్గోలు పెడుతున్నా, ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోలేదు? గత ఏడాది సంగాయగూడెంలో పొగాకు రైతు ఆత్మహ త్య చేసుకోగా, ప్రజాప్రతినిధులు కనీసం పరామ ర్శించలేదు. రైతులకు బాసటగా వైఎస్ జగన్ పర్యటి స్తే, పొగాకు ధ్వంసం చేశారని అసత్య ప్రచారం చేస్తున్నారు.
– సుంకవల్లి వెంకట శ్రీనివాస్, పొగాకు
రైతు, సంగాయగూడెం, దేవరపల్లి మండలం


