జిల్లా పరిధిలో ఇటీవల నిర్వహించిన సెన్సెస్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, సూపర్‌వైజర్లు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది తమ సాధారణ విధులతో పాటు అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తూ సెన్సెస్ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. అయినప్పటికీ, ప్రభుత్వం మంజూరు చేసిన గౌరవ వేతనాలు ఇప్పటి వరకు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
– దారపురెడ్డి తాతాజీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కో ఆర్డినేటర్, ఏపీ గ్రామ/వార్డు
సచివాలయ ఉద్యోగుల సంఘం
జాప్యం నివారించాలి
ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అవసరమైన ప్రక్రియ వేగవంతం చేసి, సెన్సెస్ విధుల్లో పాల్గొన్న ప్రతి ఉద్యోగికి వెంటనే గౌరవ వేతనం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, కాకినాడ జిల్లా శాఖ ప్రభుత్వాన్ని, సంబంధిత ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేసింది. ఆ చెల్లింపుల్లో జాప్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
– షేక్ మహబూబ్ బాషా, కాకినాడ జిల్లా
ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు
సచివాలయ ఉద్యోగుల సంఘం
ఎంతమాత్రం సమంజసం కాదు
ప్రభుత్వం నిధులను విడుదల చేసినప్పటికీ, సాంకేతిక లేదా పరిపాలనా కారణాలను చూపుతూ ఉద్యోగులకు గౌరవ వేతనాలు అందించకపోవడం సమంజసం కాదు. ఇప్పటికే అధిక పనిభారం, ఆర్థిక ఇబ్బందులతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈ జాప్యం మరింత భారంగా మారుతోంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వేతనాలను వెంటనే విడుదల చేయాలి.
– బి.జాన్ క్రిస్టోఫర్, జనరల్ సెక్రటరీ,
ఏపీ గ్రామ/వార్డు సచివాలయ
ఉద్యోగుల సంఘం, కాకినాడ జిల్లా


