కాకినాడలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ సినీనటి నిధి అగర్వాల్ సందడి చేశారు. కాకినాడ మసీద్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్ బ్రదర్స్ వస్త్ర దుకాణాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. షాపింగ్ మాల్లో ఉన్న మూడు అంతస్తులను సందర్శించి అక్కడ ఉన్న వివిధ రకాల దుస్తులను పరిశీలించారు. తరువాత షోరూం బయట ఏర్పాటు చేసిన వేదికపై తెలుగులోనే ప్రసంగించారు. తాను ప్రభాస్ సరసన రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. అనంతరం షోరూం చైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాము ఏర్పాటు చేస్తున్న ప్రతీ షోరూమ్‌లో పండగలు, వివాహాది కార్యక్రమాలకు అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండే నాణ్యమెన వస్త్రాలను అందిస్తున్నామన్నారు. కంపెనీ డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ ధరలోను, నాణ్యత లోను, అభిరుచులలో ఆర్‌ఎస్ బ్రదర్స్ ముందుంటుందని తెలిపారు. షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ సిర్ణ రాజమౌళి మాట్లాడుతూ ఇక్కడ అన్ని రకాలైన వస్త్రాలు పిల్లలకు, పెద్దలకు లభిస్తాయన్నారు.
ఆర్‌ఎస్ బ్రదర్స్ షోరూం ప్రారంభం


