100
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
రో జు ల
గందరగోళం
● టెన్త్ ప్రత్యేక తరగతులపై ‘పరాయి’ పెత్తనం
● ఇతర శాఖలకు పర్యవేక్షణ బాధ్యతలు
● ఇది టీచర్లను అవమానించడమేనంటున్న ఉపాధ్యాయ సంఘాలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): మరో మూడు నెలల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కొద్ది రోజులుగా వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. దీని ద్వారా డిసెంబర్ మొదటి వారానికే మొత్తం సిలబస్ పూర్తి చేసి, వంద రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి, పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాల్సి ఉంది. ఆలోచన గొప్పగానే ఉన్నా.. అమలుకు వచ్చేసరికి ఈ ప్రణాళిక మొత్తం గందరగోళంగా మారింది.
టీచర్లపై ‘బోధనేతర’ భారం
జిల్లాలోని 476 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 29,637 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో 251 ప్రభుత్వ పాఠశాలల నుంచి 18,097 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు గాను ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన ప్రణాళిక తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. వాస్తవానికి విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఉపాధ్యాయులకు ప్రభుత్వం అనేక బోధనేతర పనులు అప్పగించింది. దీంతో, వారు సిలబస్ సకాలంలో పూర్తి చేసేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. మరోవైపు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఒక ఎత్తయితే.. మూల్యాంకనం, మార్కుల అప్‌లోడ్ చేయడంతోనే వారికి సమయం అయిపోతోంది. మరోవైపు రకరకాల యాప్‌లు.. వాటిల్లో సమాచారం అప్‌లోడ్ వంటి వాటితో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే పదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకూ వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని విద్యా శాఖ ఆదేశించింది. దీని అమలు పర్యవేక్షణను ఆ శాఖతో ఎటువంటి సంబంధమూ లేని అధికారులకు అప్పగించింది. ఈ ఇన్‌చార్జి అధికారుల కనుసన్నల్లోనే ఈ ప్రణాళిక మొత్తం అమలవుతుందని చెప్పింది. దీనిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తమ శాఖపై ఇతరులకు పెత్తనం అప్పగించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
వివిధ శాఖలు అధికారులు ఇలా..
వంద రోజుల ప్రణాళిక అమలుకు ఇన్‌చార్జ్‌లుగా రెవె న్యూ, పంచాయతీరాజ్, వైద్య – ఆరోగ్యం, ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్, వ్యవసాయం, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్, వెటర్నరీ తదితర అధికారులను ప్రభుత్వం నియమించింది. వీరందరూ కలిసి ఆయా మండలాల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లి, ఈ ప్రణాళిక అమలును పూర్తిగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్లిప్ టెస్టుల నిర్వహణ, మార్కుల నమోదు, ఉపాధ్యాయుల హాజరు, షైనింగ్, రైజింగ్ స్టార్లుగా టెన్త్ విద్యార్థులను విభజించి పాఠాలు బోధిస్తున్నారా లేదా తదితర అంశాలను ప్రతి రోజూ పరిశీలించాలి. శని ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారో లేదో చూడాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంటుంది.
మావాళ్లుండగా వారితో పనేంటి?
వాస్తవానికి ప్రతి మండలానికీ ఎంఈఓ–1, 2లతో పాటు జిల్లావ్యాప్తంగా డిప్యూటీ డీఈఓలు, ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌పీలు ఉన్నారు. విద్యా శాఖలోనే ఇంత మంది ఉండగా.. వేరే శాఖల వారిని ఇన్‌చార్జులుగా నియమించడం దేనికనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వీరికి పాఠశాల విద్య అమలు తీరుపై ఏవిధంగా అవగాహన ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఉపాధ్యాయులను అవమానించడమేనని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కరప మండలం వేళంగిలో వంద రోజుల ప్రణాళిక అమలును పరిశీలిస్తున్న డీఈఓ రమేష్ (ఫైల్)
ఇతర శాఖల పెత్తనం తగదు
వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో విద్యా శాఖ నిర్ణయాలు విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ఆంక్షలు విధించడం అశాసీ్త్రయం. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, నిబద్ధతతో పని చేస్తూంటే ఇతర శాఖల అధికారులను తనిఖీల పేరుతో నియమించడం తగదు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – చింతాడ ప్రదీప్ కుమార్,
పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ నిర్ణయం సరికాదు
వంద రోజుల ప్రణాళిక ఏవిధంగా అమలవుతోందో పరిశీలించడానికి ఇతర శాఖల ఉద్యోగులను నియమించాలనే ప్రభుత్వ నిర్ణయం సరి కాదు. దీనివలన ఉపాధ్యాయుల ఆత్మాభిమానం దెబ్బ తింటోంది. ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు జిల్లా విద్యా శాఖ అధికారి, ఉప విద్యా శాఖ అధికారులు, ఎంఈఓలు ఉన్నారు.
– మోర్త శ్రీనివాస్, ఎస్‌టీయూ
రాష్ట అదనపు ప్రధాన కార్యదర్శి
విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి
వంద రోజుల ప్రణాళికలో భాగంగా పండగ సెలవులు కూడా ఇవ్వకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి పెట్టడం సరైన విధానం కాదు. రోజూ పరీక్షలు నిర్వహించడం, మర్నాడు మార్కులు అప్ లోడ్ చేయాలని ఆదేశించడం, విద్యా శాఖపై అవగాహ న లేని వారిని పర్యవేక్షకులుగా నియమించడం సమంజసం కాదు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం.
– శేశెట్టి సత్యనారాయణ,
అధ్యక్షుడు, ఎస్‌టీయూ, కాకినాడ
100
100
100


