ఏపీఎన్‌జీవో జిల్లా కార్యవర్గం ఎన్నిక
కాకినాడ క్రైం: ఏపీఎన్‌జీవో జిల్లా కార్యవర్గ ఎన్నిక శనివారం ఏకగ్రీవమైంది. కాకినాడలోని ఏపీఎన్‌జీవో హోంలో శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఇందులో 17 స్థానాలకు గాను ఒక్కో నామినేషనే దాఖలు చేయడం వల్ల ఆయా స్థానాలన్నీ ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు, సహాయ ఎన్నికల అధికారి, సంఘ కార్యదర్శి ఎన్‌వీ రామారావు తెలిపారు. మూడేళ్ల పదవీ కాలానికి గాను కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా గుద్దటి రామ్మోహనరావు, కార్యదర్శిగా పాలపర్తి మూర్తిబాబు, కోశాఽధికారిగా యండమూరి పద్మ మీనాక్షి ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎం.వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లుగా చంద్రరావు, ప్రసాద్, పాండురంగారావు, సత్యనారాయణ, జయకృష్ణ, భారతి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రామకృష్ణ, జాయింట్ సెక్రటరీలుగా శ్రీనివాసరావు, వీరబాబు, చార్లెస్ పాల్, లోకమాన్య పరిమళ కుమార్, వెంకటరమణ, జయలక్ష్మి ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికల పర్యవేక్షణాధికారిగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎ.రంజిత్ కుమార్ నాయుడు వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, సంఘ మాజీ అధ్యక్షులు ఆచంట రామానాయుడు, బూరిగ ఆశీర్వాదం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ అభినందించారు.
శృంగార వల్లభస్వామి
ఆలయానికి భక్తుల తాకిడి
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన సుమారు 12 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,20,860, అన్నదాన విరాళాలు రూ.61,519, కేశ ఖండన ద్వారా రూ.3 వేలు, తులాభారం ద్వారా రూ.300, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.19,035లతో కలిపి రూ.2,04,714 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 3,200 మంది భక్తులు ఆలయంలో అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. స్వామి వారికి ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు.
బ్రిడ్జి నిర్మాణాలకు భూసేకరణ వేగవంతం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ), రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీబీ) నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం జేసీ అపూర్వ భరత్‌తో కలిసి రెవెన్యూ, రోడ్డు భవనాలు, రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పీఎం గతిశక్తి పథకం కింద రైల్వే లైన్ల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జిల్లాలో పరిధిలో వివిధ ప్రదేశాల్లో రైల్వే లైనులకు అవసరమైన ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రాథమిక దశలో వీటి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. ఇందుకు రెవెన్యూ, సర్వే, రోడ్డు భవనాల శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి, ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఏపీఎన్‌జీవో జిల్లా కార్యవర్గం ఎన్నిక
ఏపీఎన్‌జీవో జిల్లా కార్యవర్గం ఎన్నిక
ఏపీఎన్‌జీవో జిల్లా కార్యవర్గం ఎన్నిక
ఏపీఎన్‌జీవో జిల్లా కార్యవర్గం ఎన్నిక


