హిందువులందరూ ఏకం కావాలి
కరప: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు హిందువులందరకూ ఏకం కావాలని కాకినాడ గీతాశ్రమం స్వామీజీ దివ్యానంద సరస్వతి పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాల్లో భాగంగా శనివారం నీలయ్య తోటలోని ఒకలే అవుట్‌లో మండల సహ కన్వీనర్ కొక్కెరమట్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 2.50 లక్షల హిందూ సమ్మేళనాలు నిర్వహించాలన్న ఆశయంలో ఇంత వరకూ 1.50 లక్షల సమ్మేళనాలు జరిగాయన్నారు. హిందూ ధర్మాన్ని దశ దిశలా వ్యాపింపజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. యానాంఖండ పూర్వ కార్యనిర్వాహక్ రామారావు మాట్లాడుతూ హిందువులందరూ బంధువులేనన్న నినాదాన్ని ప్రజలకు తెలియజెప్పాలన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు, ఆధ్యాత్మికవేత్త చాగంటి సూరిబాబు, జిల్లా మహిళా సహ కన్వీనర్ వాసంశెట్టి సూర్యవతి, మండల మహిళా కన్వీనర్ పేకేటి లక్ష్మీకాంతం పాల్గొన్నారు.


