రామానుజన్ టాలెంట్ టెస్ట్‌లో ‘భాష్యం’ ప్రతిభ
బోట్‌క్లబ్: జాతీయ స్థాయిలో నిర్వహించిన రామానుజన్ టాలెంట్ టెస్ట్‌లో స్థానిక శాంతినగర్ భాష్యం విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు భాష్యం స్కూల్ జోనల్ ఇన్‌చార్జ్ గోవిందరాజులు తెలిపారు. జాతీయ, జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించారన్నారు. ఎ.నాగగంగావర్ధన్, షేక్ కహీషా కౌషర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు, కె.లక్ష్మీసాహితి, కె.హరిధర్మ కార్తికేయ 2వ ర్యాంకు సాధించారు. జిల్లా స్థాయిలో వై.ఉత్తేజ్, కె.తనిష్క్, జి.గోవర్ధని మొదటి ర్యాంకు, వై.ప్రదీష్ ద్వితీయ ర్యాంకు సాధించారు. విద్యుత్‌నగర్ బ్రాంచ్‌కు చెందిన వై.రిషిరెడ్డి జిల్లా స్థాయి మొదటి ర్యాంకు సాధించారు. ఈ విద్యార్థులను గోవిందరాజులు బుధవారం అభినందించారు.


