మద్దతు ధర దక్కలేదు
మద్దతు ధర కోసం ఆశ పడితే ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు వేస్తుందో తెలియదు. గత ఏడాది ఖరీఫ్‌లో మిల్లులకు ధాన్యం తోలితే మద్దతు ధర వచ్చింది. కానీ, మూడు నెలల తర్వాత ధాన్యం డబ్బులు నా ఖాతాలో వేశారు. చెల్లింపులు ఆలస్యం కావడంతో రబీ పెట్టుబడులకు బయట అప్పులు చేయాల్సి వచ్చింది. వచ్చిన లాభం వడ్డీలకు సరిపోయింది. అందుకే, ఈ ఏడాది రేటు తక్కువైనా ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకున్నాను.
– కర్నీడి వీర్రాజు, రైతు,
తిమ్మాపురం, కాకినాడ రూరల్


