నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఒప్పందం

Jul 27 2025 7:00 AM | Updated on Jul 27 2025 7:00 AM

నైపుణ

నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఒప్పందం

గండేపల్లి: పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి శిక్షణకు సీఎస్‌సీ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ప్రగతి ఇంజినీరింగ్‌ కళాశాల చైర్మన్‌ పి.కృష్ణారావు తెలిపారు. సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అంశాలైన ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, 3డీ ప్రింటింగ్‌, డేటా ఇంజినీరింగ్‌, రోబోటిక్స్‌, తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ అవగాహన పత్రాలను మార్చుకున్న కార్యక్రమంలో డైరెక్టర్‌ ఎంవీ హరనాథబాబు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

తెగిపడిన విద్యుత్‌ తీగలు

రెండు తాడిపెద్దుల మృతి

తుని: స్థానిక మార్కెట్‌ యార్డులో విద్యుత్‌ తీగలు తెగిపడిన సంఘటనలో రెండు తాడి పెద్దులు మృతి చెందాయి. శనివారం ఉదయం పశువులు ఆ మార్కెట్‌లోని వ్యర్థాలను తింటుండగా ఒక్కసారిగా విద్యుత్‌ తీగలు పడటంతో రెండు తాడిపెద్దులు విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ సమయంలో జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సరఫరాను నిలిపివేశారు. విద్యుత్‌ శాఖ లైన్ల నిర్వహణ సమయంలో తగు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరారు.

నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఒప్పందం 1
1/1

నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఒప్పందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement