
దళిత విద్యార్థులపై కూటమి ప్రభుత్వ కక్ష
ఫ వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్
రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఫైర్
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): దళిత విద్యార్థులంటే కూటమి ప్రభుత్వానికి అలుసని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆరోపించారు. వారు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగడం సీఎం చంద్రబాబుకు ఇష్టం లేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం ఎస్సీ హాస్టల్‌ను యూనియన్ జి ల్లా అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీటి ఆనంద్ ఆధ్వర్యాన చైతన్య మంగళవారం సందర్శించారు. సమస్యలు స్వయంగా పరిశీలించి, విద్యార్థుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, వసతి గృహాలను పాడుబెడుతున్నారని, విద్యార్థులకు సరైన తిండి పెట్టకుండా ఆసుపత్రి పాలు చేస్తున్నారని ఫైరయ్యారు. జగన్ హయాంలో ఇచ్చిన మంచి భోజనం, మంచి దుస్తులు, పరిసరాల పరిశుభ్రత మాయమైపోయాయని మండిపడ్డారు. పేద విద్యార్థులు బా గా చదువుకుని, మంచి ఉద్యోగాలు పొందాల ని, తద్వారా రాష్ట్రంలో పేదరికం కనుమరుగైపోవాలని గత ముఖ్యమంత్రి జగన్ ఆశిస్తే.. ప్రస్తు త సీఎం చంద్రబాబు దానికి పూర్తి విరుద్ధంగా ఆలోచిస్తున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని చెప్పా రు. రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చైతన్య డిమాండ్ చేశా రు. వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రీజినల్ కో ఆర్డినేటర్ రమేష్, విద్యార్థి నేతలు రేష్మ, కేపీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.