
ఆర్మీ ర్యాలీ, హాకీ టోర్నమెంట్‌కు విరాళం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో ఆగస్టులో నిర్వహించే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, హాకీ జాతీయ జూనియర్ మహిళా టోర్నమెంట్‌కు ఽశ్రీప్రకాష్ విద్యాసంస్థలు రూ.2 లక్షల సహకారం అందించాయి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌కు శ్రీప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ శనివారం కలెక్టర్ చాంబర్‌లో చెక్ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీప్రకాష్ విద్యాసంస్థల యాజమాన్యాన్ని కలెక్టర్ అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలకు సహకరించడం సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు.