రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని సుమారు 126 ఏళ్ల వయసున్న వృక్షానికి పునరుజ్జీవం వచ్చింది. స్థానిక టౌన్ హాలు రోడ్డులోని మెరక వీధిలో కొద్ది రోజుల క్రితం ఆ చెట్టు కూలిపోయింది. దీంతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ స్పందించింది. ఆ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ తీగెల రాజా ఆధ్వర్యంలో ఆ చెట్టును శుక్రవారం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయ ఆవరణలో నాటారు. ఐకాన్స్ ప్రెసిడెంట్ మండవల్లి వెంకన్న బాబు, ప్రోగ్రాం చెర్మన్ రైతుబిడ్డ దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీ డి.నవీన్ ప్రసాద్, సభ్యులు పాల్గొన్నారు.