జాతీయ లోక్‌ అదాలత్‌లో 8,486 కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

జాతీయ లోక్‌ అదాలత్‌లో 8,486 కేసుల పరిష్కారం

Sep 13 2026 1:06 AM | Updated on Sep 13 2026 1:06 AM

గద్వాల క్రైం: జాతీయ లోక్‌ అదాలత్‌లో వివాదాలను పరిష్కరించుకుంటే కక్షిదారుల్లో సోదరభావం పెంపొందడంతోపాటు సమయం, డబ్బు, ఆదా అవుతుందని జిల్లా కోర్టు న్యాయమూర్తి కల్యాణ్‌ చక్రవర్తి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం గద్వాల కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి కేసులు పరిష్కారం చేసుకోకుంటే ప్రయోజనం లేదన్నా రు. సాంకేతిక విప్లవంలో కేసుల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఇరువర్గాల కక్షిదారులు తమ విలువైన భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కేసుల నుంచి విముక్తి పొందేందుకు కలిసిరావాలన్నారు. ఈ లోక్‌ అదాలత్‌లో 8,486 కేసులు పరిష్కరించినట్లు ఆయన చెప్పారు. క్రిమినల్‌, సివిల్‌, సైబర్‌ క్రైం, బ్యాంకు లిటిగేషన్‌, ప్రమాద తదితర పెండింగ్‌ కేసు లకు సంబంధించి ఇరువర్గాల వారిని రాజీ కు దిర్చినట్లు వెల్లడించారు.

16న కబడ్డీ జట్ల ఎంపిక

గద్వాల న్యూటౌన్‌: జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 8 గంటలకు జిల్లాకేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో జిల్లా కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షరాలు డీకే స్నిగ్ధారెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్‌ బాలుర, సబ్‌ జూనియర్‌ బాలికల కబడ్డీ జట్ల ఎంపికలు ఉంటాయన్నారు. ఎంపికలకు వచ్చే జూనియర్‌ బాలురు 5.11.2006 తర్వాత జన్మించి, 75 కిలోల లోపు బరువు, సబ్‌ జూనియర్‌ బాలికలు 13.12.2010 తర్వాత జన్మించి, 55 కిలోల లోపు బరువు ఉన్నవారు అర్హులు అన్నారు. ఎంపికలకు వచ్చే క్రీడాకారులు 10వ తరగతి సర్టిఫికెట్‌, ఆధార్‌కార్డు, బోనోఫైడ్‌ ఒరిజినల్‌ తీసుకురావాలని సూచించారు. జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 26 నుంచి 29 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సెల్‌ నంబర్లు 94407 26887, 99511 03371లను సంప్రదించాలని కోరారు.

దళితులపై

సీఎంది కపట ప్రేమ

గద్వాల: దళితులపై సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్నది కపట ప్రేమ అని, మరో కులానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దళితుడి ఇళ్లు కూలగొట్టించిన సర్పంచ్‌ని ప్రభుత్వం కాపాడుతుండడమే ఇందుకు నిదర్శనమని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కులాంతర వివాహాం చేసుకున్న ఎస్సీ యువకుడి ఇంటిని సర్పంచ్‌ అండతోనే యువతి కుటుంబ సభ్యులు కూల్చివేశారన్నారు. ఇది పూర్తిగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే నేరమని, అమావనవీయ ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులందరీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌ కుట్రతోనే విధ్వంసం జరిగిందని యువతి తెలిపారన్నారు. అయినా ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటి వరకు సర్పంచ్‌ పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement