నైపుణ్యం కలిగిన పశువులు.. | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యం కలిగిన పశువులు..

Sep 13 2026 1:06 AM | Updated on Sep 13 2026 1:06 AM

న్ననూర్‌ గిత్తగా గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. వ్యవసాయ పనుల్లో ఈ పశువులు మంచి నైపుణ్యం ప్రదర్శిస్తాయి. ఎంత కష్టమైన పనులైనా చేస్తాయి. 35 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. నల్లమల పశువులకు నాటు పశువులుగా గుర్తింపు ఉంది.

– హన్మంతు, పశువుల వ్యాపారి,

తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు

ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం..

నాకు 50 వరకు పశువులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు పొడ జాతి పశువులు ఉన్నాయి. ఈ పశు సంతతిని పెంచేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. నల్లమల రైతులకు పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం, నీటి కొరత ప్రధాన కారణంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం పశు జాతిని సంరక్షించేందుకు పునరావాస, పశుగ్రాసం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ పశువుల వల్ల నల్లమల అడవికి ఎలాంటి నష్టం ఉండదు. అడవిలో మేపుకొనేందుకు అనుమతి ఇవ్వాలి.

– శివాజీ గెలువయ్య, మన్ననూర్‌, అమ్రాబాద్‌ మండలం

ప్రత్యేక హోదా

కల్పిస్తాం..

ల్లమల పొడజాతి మన్ననూర్‌ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. ప్రత్యేకమైన మచ్చలపై పరిశోధన చేయిస్తాం. ఇక్కడ సంతానోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నల్లమల పశువులకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ జాతి పశువులను సంరక్షించేందుకు ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని నల్లమలకు గుర్తింపు తెస్తాం.

– వంశీకృష్ణ,

ఎమ్మెల్యే, అచ్చంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement