గద్వాల క్రైం: కులాంతర వివాహాన్ని జీర్ణించుకోలేకే అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటిని కూల్చివేశారని, ఈ మేరకు నిందితులను శనివారం అరెస్టు చేశామని డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గద్వాల మండలం రేపల్లె గ్రామానికి చెందిన దళిత యువకుడు రంగముని, బోయ మహేశ్వరి హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ నెల 10న రంగముని ఇంటిని జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఈ సంఘటనపై రంగముని చిన్నాన్న చిన్నగోపాల్ అదేరోజు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు. ఇంటిని ధ్వంసం చేసి తప్పించుకుని తిరుగుతున్న వీరన్న, పరుశ, వెంకటేష్, పరుశ, రామాంజనేయులు, గోపాల్, తిమ్మన్నలను శనివారం సాయంత్రం గ్రా మ శివారులో ఉన్నట్లు సమాచారం మేరకు సి బ్బంది వారిని అదుపు లోకి తీసుకున్నారన్నా రు. నిందితులను విచారణ చేయగా నేరం అంగీకరించడంతో ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితులను అలంపూర్ కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలి స్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రజలందరూ సోదరభావంతో కలసిమెలసి ఉండాలన్నారు. ప్రజ ల ప్రాణాలు, ఆస్తులపై దాడులు చేస్తే క్రిమినల్ కే సులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తు తం రేపల్లె గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొందని డీఎస్పీ చెప్పారు.


