గద్వాల: వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనిచేస్తున్నారని, 2047 నాటికి ఆ లక్ష్యం నెరవేరుతుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో విద్యార్థులు, యువత, బీజేపీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తి అవుతుందని, దేశ అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం కావాలన్నారు. దేశభక్తిని చాటుకోవాల్సిన సందర్భం ఇదే అన్నారు. ప్రతిఒక్కరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, రామచంద్రారెడ్డి, వెంకట్రాములు, వెంకటేశ్వర్‌రెడ్డి, శివారెడ్డి, కృష్ణ, జయశ్రీ, మానస తదితరులు పాల్గొన్నారు.


