ఖాకీల్లో కలవరం | - | Sakshi
Sakshi News home page

ఖాకీల్లో కలవరం

Aug 14 2026 7:38 AM | Updated on Aug 14 2026 7:38 AM

గద్వాల పరిధిలోనూ..

ద్వాల నియోజకవర్గ పరిధిలోని ఠాణాల్లోనూ ఇందుకు అతీతంగా ఏమీ లేదు. ఇక్కడ పనిచేయాలన్నా.. స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకుల ఆశీస్సులు తప్పనిసరే. కాకపోతే ఇక్కడ ముడుపులు తీసుకుని పోస్టింగ్‌లు ఇవ్వరు కాని.. సదరు పలుకుబడి నేతలు చెప్పిన పనులన్నీ తూ.చ. తప్పకుండా చేసి పెట్టాల్సిందే. ఈ క్రమంలో కొందరు పోలీసు అధికారుల తీరు.. పోలీసు బాసుల ఆదేశాల కంటే కూడా సదరు పలుకుబడి గల నేతల ఆదేశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం బాహాటంగానే వినిపిస్తుంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌..

టీవల ఇసుక అక్రమంగా రవాణా చేసే వ్యక్తులు, నాయకులు మొదలుకొని.. పోలీసుల వరకు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ఇవ్వాల్సి వస్తుందో చెబుతూ ఓఆ డియో వైరల్‌ అయ్యింది. దీనిపై రాష్ట్ర పోలీసు బాస్‌ గద్వాల జిల్లాలో ఏం జరుగుతుందో అంతర్గతంగా ఆరా తీసినట్లు సమాచారం.

జిల్లాకేంద్రంలోని ఓ అధికారిపై..

జిల్లాలోని పోలీస్‌ స్టేషన్లనే అడ్డాగా చేసుకుని పైరవీలు చేస్తున్న కొందరు పోలీసు అధికారులపై రాష్ట్ర పోలీసుబాస్‌ కూపీ లాగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలో ఉన్న ఓ ఠాణా అధికారిపై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ పోలీసు శాఖలో కలవరం రేపుతుంది.

సెలవులపై వెళ్లేందుకు ప్రయత్నం..

వినీతి, ఆరోపణల నేపథ్యంలో డీఐజీ స్థాయి అధికారిపైనే బదిలీ వేటు పడిందంటే తమపై వేటు ఏ స్థాయిలో ఉంటుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఓ పోలీసు అధికారి ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏకంగా సదరు అధికారి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తుండటం పోలీసు వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని నలుగురు డివిజనల్‌ స్థాయి అధికారులపై వేటు పడనున్నట్లు సోషల్‌ మీడి యాలో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లేందుకు పలువురు అధికారులు ప్రయత్నాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

గద్వాల: జోగుళాంబ జోన్‌–7 డీఐజీ చౌహాన్‌పై పలు ఆరోపణల నేపథ్యంలో బదిలీ వేటు పడటం సంచలనం రేపుతుండగా.. మరోవైపు గద్వాల జిల్లా పోలీసు శాఖలో కొంతమంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్లో కలవరం మొదలైంది. ఎక్కడో మెరిసిన ఉరుము గద్వాలలో ఉన్న మన మీద ఎక్కడ వచ్చి పడుతుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీసు అధికారి టెన్షన్‌ భరించలేక ఏకంగా దీర్ఘకాలిక సెలవులపై వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు పోలీసు వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది.

డీఐజీపై బదిలీ వేటుతో గద్వాల పోలీసు శాఖలో మొదలైన గుబులు

ఇటీవల సోషల్‌ మీడియాలోనూ

వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు

అంతర్గతంగా విచారణ జరుపుతున్న రాష్ట్ర పోలీసు బాస్‌

అలంపూర్‌ పరిధిలో పోస్టింగ్‌ల కోసం జరిగిన పైరవీలపై ఆరా

ఠాణాలనే అడ్డాగా చేసుకుని సాగిస్తున్న దందాపై వివరాల సేకరణ

తుంగభద్రతో కాసుల పంట..

ప్రఽదానంగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో, ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో అలంపూర్‌ నియోజకవర్గంలో పోలీసు ఠాణాలు మొదలుకొని.. సర్కిల్‌ పరిధిలో పోస్టింగ్‌ వరకు ఇక్కడి అధికార పార్టీకి చెందిన నాయకుల ఆశీస్సులు ఉంటేనే పోస్టింగులు సాధ్యమవుతాయన్నది బహిరంగ రహస్యం. ఇక్కడ ఎవరు పలుకుబడి ఉంటే వారికి నెల మామూళ్లు ఇచ్చుకోవాల్సిందేనని పుష్కర కాలంగా పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికంతటి ప్రధాన కారణం కాసులు కురిపించే తుంగభద్ర ఇసుక ఉండడమే. ఒక్కసారి అలంపూర్‌లో పనిచేస్తే లైఫ్‌ టైం సెటిట్‌ అయ్యేలా కాసులు పోగేసుకోవచ్చనే బలమైన నమ్మకం ఉండటంతో కొందరు ఖాకీలు ముడుపులు ఇచ్చి మరీ పోస్టింగలు తెప్పించుకుంటారని ప్రచారం. అయితే నిజాయితీగా పనిచేసే అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వరా అంటే ఇస్తారు.. కానీ, ఏడాది తిరిగేలోపు.. ఏదో ఒక సాకుతో వారిని బదిలీ చేయడమో.. అటాచ్‌ చేయడమో సర్వసాధారణంగా మారింది. ఇలా ఆరునెలల వ్యవధిలో బదిలీ అయిన ఓ నిజాయితీ గల పోలీస్‌ అధికారి ఇక్కడ ఉద్యోగం చేయాలంటేనే విసుగు వస్తుందని చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పైరవీ ఉంటేనో.. నాయకులకు వత్తాసు పలికితేనో పూర్తిస్థాయిలో పనిచేస్తారు.. నిబంధనల ప్రకారం చేసే నాలాంటి వారికి మాత్రం ఆరు నెలల్లో బదిలీని బహుమానంగా ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేయడం ఇక్కడి పోలీసు శాఖలో అవినీతిని ఎండగడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement