రాజోళి: ఇంట్లో గ్యాస్ బండ అయిపోతుందంటే.. రెండోది సిద్ధంగా ఉందిలే అనుకుని ఎలాంటి చింత లేకుండా ఉండే రోజుల నుంచి.. కొత్త కనెక్షన్లు ఇవ్వక, రెండో సిలిండర్ లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ.. ఇన్నీ.. కావు. కొత్త కనెక్షల్లు ఇచ్చి ఏడాది దాటిపోయిందని, రెండో కుండ కోసం ఎదురుచూడబట్టి రెండేళ్లు అవుతుందని జిల్లా ప్రజలు వాపోతున్నారు. గ్యాస్ కనెక్షన్లు ఇవ్వకపోగా.. ఉన్న కనెక్షన్‌కు సిలిండర్ ఇచ్చేందుకు నిర్దేశించిన సమయం దాటినా కూడా సిలిండర్ ఇవ్వకపోతుండంటతో ప్రజలు వంట వండుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
రెండో కనెక్షన్‌కు డిమాండ్
ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమాసియాలో మొదలైన యుద్ధంతో గ్యాస్ కష్టాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. గతంలో రెండు సిలిండర్లు ఉండటంతో ఒకటి అయిపోయేలోగా మరొకటి సిద్ధం చేసుకునేవారు. కానీ, ప్రస్తుతం ఒక సిలిండర్ తీసుకున్నాక 45 రోజుల వరకు మళ్లీ సిలిండర్ ఇవ్వకపోవడంతో ప్రజలకు బ్లాక్ ధరలు తప్పడం లేదు. దీంతో రెండో కనెక్షన్ కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరగడంతోపాటు రెండో కనెక్షన్ డిమాండ్ కూడా పెరుగుతుంది. కానీ, దేశవ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్లు నిలిచిపోవడం, ప్రస్తుతం గ్యాస్ కోసం పడుతున్న కష్టాలు ఎక్కువగా ఉండటంతో, కొత్త కనెక్షన్ల కోసం అందరూ ఒక్కసారిగా ఎగబడే అవకాశం ఉందని జిల్లా ప్రజలు అంటున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి సమస్య ఉత్పన్నం కాకముందే, ఎక్కువ కాలం కింద గ్యాస్ కనెక్షన్ కోసం, రెండో కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారితో మొదలుపెట్టి కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలా కాని పక్షంలో ఉన్న ఏజెన్సీలపై దృష్టిపెట్టాలని, బ్లాక్ దందాను అరికట్టాలని కోరుతున్నారు. జిల్లాకేంద్రంతోపాటు అయిజ, శాంతిగనర్, రాజోళి తదితర చోట్ల బ్లాక్ దందా యథేచ్ఛగా సాగుతోంది. కొరతను సాకుగా చూపి రూ.2– 3 వేల దాకా అధికంగా అమ్ముకుంటున్నారు.
జిల్లా పరిధిలో ఇలా..
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కనెక్షన్లకు బ్రేక్
సిలిండర్ కుండ, కొత్త కనెక్షన్
ఇవ్వని ఏజెన్సీలు
గ్యాస్ కొరతను
సాకుగా చూపి బ్లాక్ దందా
తమకేమీ పట్టనట్లుగా
వ్యవహరిస్తున్న అధికారులు
డబుల్ కనెక్షన్లు
35,753
సింగిల్ కనెక్షన్లు
85,095
ఉజ్వల ఇతర కనెక్షన్లు
56,329


