ప్రభుత్వం దృష్టిపెట్టాలి.. | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం దృష్టిపెట్టాలి..

Aug 11 2026 1:12 AM | Updated on Aug 11 2026 1:12 AM

గ్యాస్‌ బుకింగ్‌కు నిర్ణీత సమయం (45 రోజులు) పెట్టారు. కానీ, బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు కొన్ని ఏజెన్సీల వారు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. డెలివరీ చేసేందుకు వచ్చేవారు కూడా అధిక ధరలకు అమ్ముకోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏజెన్సీ దగ్గరకే వచ్చి తీసుకోవాలంటున్నారు. అదనంగా రవాణా ఖర్చులు పడుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాలి. ముందుగా బ్లాక్‌ ధరలను నియంత్రించాలి.

– శ్రీరామ్‌, శాంతినగర్‌

ఎదురుచూస్తున్నాం..

రెండో గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకునేందుకు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం. గత వారంలో గ్యాస్‌ అయిపోయితే ఏజెన్సీల చుట్టూ తిరగలేక విసిగిపోయాను. ఇప్పుడేమో రెండో కనెక్షన్‌ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కొందరు ఏజెన్సీ నిర్వాహకులు బయట మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. ఏజెన్సీలు సిలిండర్లను పక్కదారి పట్టించకుండా సజావుగా అందిస్తే కొరతను అధిగమించవచ్చు.

– శివప్రసాద్‌, శాంతినగర్‌

నిఘా పెడతాం..

శ్చిమాసియాలో యుద్ధం కారణంగా కొత్త కనెక్షన్లు ఇవ్వడం నిలిపేశారు. ఈ సమస్య అంతటా ఉన్నందున కొత్త కనెక్షన్‌ కాని, రెండో కుండ కాని ఇవ్వడం కుదరదు. పై నుంచి ఆదేశాలు వస్తేనే ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. ఇక బ్లాక్‌ మార్కెట్‌లో సిలిండర్ల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. – స్వామికుమార్‌, డీఎస్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement