అలంపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డా.ఎస్‌ఏ సంపత్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో అలంపూర్ మండల సర్పంచులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ.. ప్రతి గ్రామంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు అభివృద్ధి పనులను వేగంవంతం చేయాలని సూచించారు. అనంతరం అలంపూర్ మండల సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ర్యాలంపాడు రఫీ, ఉపాధ్యక్షుడిగా కాశీపురం మద్దిలేటి, ప్రధాన కార్యదర్శిగా భైరన్‌పల్లి స్వాతిని ఎన్నుకోగా.. సంపత్‌కుమార్ శాలు వాతో సత్కరించారు. సమావేశంలో ఆ సంఘం జి ల్లా అధ్యక్షుడు గొంగోళ్ల ఈశ్వర్, సర్పంచులు స్వరూ ప, హరికృష్ణ, మురళీధర్‌గౌడ్, శ్రీపతి నాయుడు, మండల అధ్యక్షుడు రాము ఉన్నారు.


