గద్వాల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లతో కార్మికవర్గం అన్యాయానికి గురవుతోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నర్సింహ అన్నారు. బుధవారం గద్వాల మండలం మదనపల్లి, శెట్టిఆత్మకూరు గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలనలో వ్యవసాయ కార్మికుల ఉపాధి పూ ర్తిగా దెబ్బతిందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానలకు వ్యతిరేకంగా ఈ నెల 10న కలెక్టరేట్ వద్ద జైల్‌భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, కూలీలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జైల్‌భరోకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో సీతారాముడు, ఆనంద్, రామకృష్ణ, భాగ్యమ్మ, అంజిలన్న, రత్నమ్మ, సంజీవులు ఉన్నారు.


