భూపాలపల్లి: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి 12 ఫిర్యాదులు స్వీకరించారు. సీఐలు, ఎస్సైలతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు పైరవీలు, మధ్యవర్తులు లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధంగా ప్రతీ ఒక్కరికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు. సత్వర, పారదర్శక సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఎస్పీ చెప్పారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


