నేను గ్యాస్ స్టౌలు రిపేర్ చేసేందుకని చిట్యాలతో పాటు పక్కనున్న మండలాల్లోని గ్రామాలకు వెళ్తుంటాను. ఏ గ్రామంలో చూసినా కోతులే ఉంటున్నాయి. ఎక్కడ ఆగితే కోతులు కరుస్తాయోనని భయమేస్తుంది. నెల రోజుల కింద గ్యాస్ పొయ్యి రిపేరు చేసేందుకని మొగుళ్లపల్లిలోని ఓ ఇంటికి వెళ్తుంటే కోతులు కరిచాయి. వెంటనే చిట్యాల సివిల్ ఆస్పత్రికి వచ్చి ఇంజక్షన్ వేయించుకున్నా.
మోటం శ్రీకాంత్, చల్లగరిగ,
చిట్యాల మండలం
మా ఊరిలో విపరీతంగా కోతులు ఉన్నాయి. వాటి బాధకే కూరగాయలు, మొక్కజొన్న పంటల సాగు ఎవరూ చేయడం లేదు. నాకున్న రెండెకరాల్లో పత్తిపంట వేసిన. ప్రతీరోజు కోతులు వచ్చి కాయలు ఒలుచుకొని మరీ తింటున్నాయి. అసలే కాలం కలిసిరాక ఇబ్బంది పడుతుంటే ఈ కోతులు పంటను నాశనం చేస్తున్నాయి.
– క్యాతం భూమయ్య, రైతు, చిట్యాల
●


