కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరికి తొలిఏకాదశి పండుగ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శనివారం ఉదయం నుంచి వీఐపీ ఘాటు, సాధారణ ఘాట్ల వ ద్ద భక్తులు పుణ్యస్నానాలు చేశారు. గోదావరి మా తకు సైకత లింగాలు ఏర్పాటు చేసి పూజించారు. అరటి దొప్పల్లో దీపాలు, పూలు వదిలారు. శివసత్తుల పూనకాలతో తీరం హోరెత్తింది. కొత్త నీరు రావడంతో ఇసుకతో పాటు బాటిళ్లు, క్యాన్లలో నీరు ఇళ్లకు తీసుకువెళ్లారు. సరస్వతీఘాటు వద్ద ఉన్న స రస్వతీమాతను భక్తులు దర్శించుకున్నారు. అనంతరం శ్రీఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాటు చేసిన బాలాలయంలో దర్శనాలు చేశారు. ప్రస్తుతం ప్రధా న కాళేశ్వరం దేవాలయం జీర్ణోద్ధరణ నేపద్యంలో మూసివేసి ఉండడంతో రాజగోపురం ఎదుట ఉన్న శివలింగానికి భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులుచెల్లించారు. సుమారు 30వేలకుపైగా భక్తులు ద ర్శనాలు, గోదావరి స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. పూజలు, ప్రసాదం ద్వారా రూ. 2.24 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు తెలిపారు. కాగా జిల్లావ్యాప్తంగా తొలిఏకాదశి పండుగను భక్తులు ఘనంగా జరుపుకున్నారు.
స్నానాలకు పోటెత్తిన భక్తులు
జిల్లాలో ఘనంగా తొలి ఏకాదశి పండుగ


