తాడిచర్ల డేంజర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్ల సేకరణకు 2022 సంవత్సరం డిసెంబర్ 14న 359.23 ఎకరాలకు 2600 పైచిలుకు ఇళ్లకు పీఎన్‌ను ప్రతికల్లో ప్రచురించారు. ఇప్పటికి పలుమార్లు సర్వేలు నిర్వహించినా డీడీ (డ్రాఫ్ట్ డిక్లరేషన్) ప్రకటించలేదు. దీంతో డేంజర్ జోన్ సమస్య మొదటికి వచ్చింది. డేంజర్ జోన్ సేకరణకు ప్రభుత్వం రూ.261 కోట్లు కలెక్టర్ ఖాతాలో జమచేసినట్లు తెలిసింది. దీంతో రెవెన్యూ అధికారులు విత్ లిస్ట్ 1,203 (జీపీ రికార్డులో ఇంటి నంబర్లు), విత్‌అవుట్ లి్‌స్ట్ 1,062 (ఇంటి నంబర్లు లేనివి) ఆధారంగా ఐదు టీంలు 20 రోజులుగా ఇంటింటి సర్వే చేస్తున్నాయి. ఈ సర్వేలో ఇంటి పన్ను, కరెంట్, ఆధార్‌కార్డు, కరెంట్ బిల్లు, ఓటర్ కార్డు తదితర వివరాలు సేకరిస్తున్నారు. మరో నాలుగు, అయిదు రోజుల్లో సర్వే పూర్తికానుంది. సర్వే ముగిసిన అనంతరం జీపీలో అధికారులు గ్రామసభ నిర్వహించి జాబితాను చదివి వినిపించి, డీడీ (డ్రాఫ్ట్ నోటిఫికేషన్) ప్రచురించనున్నట్లు తెలుస్తుంది. డీడీ ప్రకటించకపోతే డిసెంబర్‌లో పీఎన్ పూర్తిగా రద్దుకానున్నుట్లు సమాచారం.


