– భూపాలపల్లి/రేగొండ/చిట్యాల/టేకుమట్ల/ మొగుళ్లపల్లి/కాళేశ్వరం/మల్హర్‌/మహాముత్తారం | - | Sakshi
Sakshi News home page

– భూపాలపల్లి/రేగొండ/చిట్యాల/టేకుమట్ల/ మొగుళ్లపల్లి/కాళేశ్వరం/మల్హర్‌/మహాముత్తారం

Jul 14 2026 1:12 AM | Updated on Jul 14 2026 1:12 AM

– 8లోu ఆ దవాఖానాల్లో ఒక్కో డాక్టరే.. నిరుపయోగంగా సెల్‌ కౌంటింగ్‌ మిషన్లు.. కలెక్టర్‌కు నివేదించాం.. నిధులు రాక రెండేళ్లు.. 42 ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీ..

న్యూస్‌రీల్‌

చిట్యాల సీహెచ్‌సీలో

ఒక్కరోజే 55 కేసులు..

మంగళవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2026
జిల్లావ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు వారంరోజులుగా పెరుగుతున్నాయి. జ్వర పీడితులు పెరుగుతుండడంతో పల్లెల్లో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతుంటే.. పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీనికి తోడు రక్త కణాలను లెక్కించే యంత్రాలున్నా కెమికల్స్‌లేక పనిచేయకపోవడంతో ఏ చిన్న పరీక్షకై నా, వైద్య సేవలకై నా రోగులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి రెఫర్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పరీక్షల రిపోర్ట్‌లు వెంటనే రాకపోవడంతో వైద్యం వెంటనే అందక పేదరోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎల్‌నినో ప్రభావంతో పల్లెల్లో డెంగీ కేసులు పెరిగితే పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది.

ఎత్తిపోతలపై అవగాహన లేని సీఎం

గోదావరి నీటి ఎత్తిపోతలపై సీఎం రేవంత్‌రెడ్డికి కనీసం అవగాహన లేదని ఎమ్మెల్సీ రవీందర్‌ రావు దుయ్యబట్టారు.

తాడిచర్ల–2.. బాహుబలి బ్లాక్‌

జిల్లాలోని తాడిచర్ల–2 సింగరేణి సంస్థకు బాహుబలి బ్లాక్‌ అని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

వాతావరణం

జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. పలు చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.

చిట్యాల సీహెచ్‌సీలో జ్వర పీడితులను

పరీక్షిస్తున్న వైద్యులు

జిల్లాలో

769

మందికి ఫీవర్‌

సోమవారం

చిట్యాల సీహెచ్‌సీలో

55 కేసులు

ఆరోగ్య కేంద్రాల్లో

వైద్యులు, సిబ్బంది కొరత

సెల్‌ కౌంటింగ్‌ మిషన్లున్నా

కెమికల్స్‌ లేవు

అన్ని పరీక్షలు, వైద్యసేవలకు

జీజీహెచ్‌కు రెఫర్‌

పీహెచ్‌సీలకు రెండేళ్లుగా

అందని జేఏఎస్‌ నిధులు

ఎస్‌ఐఆర్‌ హెల్ప్‌లైన్‌

కేంద్రం ప్రారంభం

భూపాలపల్లి అర్బన్‌: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు అవసరమైన సమాచారం అందించేందుకు భూపాలపల్లి అంబేడ్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్‌ఐ హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఆర్డీఓ హరికృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణకు సంబంధించిన దరఖాస్తులు, సందేహాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు ఈ కేంద్రాన్ని వినియోగించుకుని సమగ్ర సమాచారాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మిరాజయ్య, జీపీఓ కిరణ్‌, తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది సాగర్‌, శ్రావణ్‌, రాజ్‌కుమార్‌, వరుణ్‌ పాల్గొన్నారు.

ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు

గణపురం: ఆరుద్ర నక్షత్రం చతుర్ధశి పర్వదినం సందర్భంగా మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు జూలపల్లి నాగరాజు ఆధ్వర్యంలో గణపతిపూజ, నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు, గణపేశ్వరునికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. గణపురం ఎస్‌ఐ అశోక్‌తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

ఆదిముక్తీశ్వరాలయంలో భక్తుల సందడి

కాళేశ్వరం: ఆరుద్ర నక్షత్రం మహా శివుడికి జన్మనక్షత్రం సందర్భంగా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం దేవస్థానంలోని బాలాలయంలో భక్తులు సందడి నెలకొంది. సోమవారం కావడంతో ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. ఆదిముక్తీశ్వరాలయంలో భక్తులు అభిషేక పూజలు చేశారు. అనంతరం బాలాలయంలో ఉత్సవ మూర్తులను దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడితో శివనామస్మరణ మారుమోగింది.

వనదేవతలకు మొక్కులు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని మేడారం సమ్మక్క– సారలమ్మల సన్నిధిలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వివిధ వాహనాల్లో తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు సమర్పించారు. ఎత్తు బంగారం, యాటలతో మొక్కులు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల రీజియన్‌ సంయుక్త అధికారి బొంగిని రాజేశ్‌గౌడ్‌, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేశ్‌లు కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు.

శివభక్తుల సందడి

వెంకటాపురం(ఎం): శివభక్తులతో రామప్ప ఆలయం కిటకిటలాడింది. సోమవారం శతవసంతాల మహాశైవాక్షయోగం సందర్భంగా భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం 4 గంటల నుంచే పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు చేసేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో పూజలు నిర్వహించేందుకు భక్తులకు సుమారు గంటన్నర సమయం పట్టింది. ఆర్చకులు హరీశ్‌శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

మారుమూల అటవీ ప్రాంతాలైన మహదేవపూర్‌ మండలంలోని అంబట్‌పల్లి, మల్హర్‌ మండలం తాడిచర్ల, మహాముత్తారం పీహెచ్‌సీల్లో ఒక్కో వైద్యుడు మాత్రమే సేవలు అందిస్తున్నారు. ఆయా పీహెచ్‌సీల్లో ఇద్దరు చొప్పున వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కో పోస్టు చొప్పున ఖాళీ ఉన్నాయి. మహాముత్తారం పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు ఒకరిని డిప్యుటేషన్‌పై ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌గా పంపారు. మహదేవపూర్‌, పలిమెల, మహాముత్తారం, కాటారం, మల్హర్‌ మండలాల ప్రజలకు సేవలు అందించే మహదేవపూర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)లో గైనకాలజిస్ట్‌, పిల్లలు, మత్తు, దంత వైద్యులు లేరు. మొగుళ్లపల్లి పీహెచ్‌సీలో గడిచిన మూడేళ్లుగా ఫార్మాసిస్ట్‌ పోస్టు ఖాళీగా ఉంది. చిట్యాల సీహెచ్‌సీకి సూపరింటెండెంట్‌ కరువయ్యాడు.

ఎవరికై నా జ్వరం వస్తే వైద్యులు మొదటగా కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌(సీబీపీ) రక్త పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష చేసే సెల్‌ కౌంటింగ్‌ మిషన్లు పలుచోట్ల పని చేయడం లేదు. అంబట్‌పల్లి, గణపురం, కాటారం, మొగుళ్లపల్లి, వెలిశాల పీహెచ్‌సీల్లో రియాజెన్స్‌(కెమికల్స్‌) లేక సెల్‌ కౌంటింగ్‌ మిషన్లు మూలన పడ్డాయి. చేసేది లేక ల్యాబ్‌ టెక్నీషియన్లు సీబీపీ కోసం రక్త నమూనాను జీజీహెచ్‌కు పంపిస్తున్నారు. దీంతో రోగులు తమ రక్త పరీక్ష రిపోర్ట్‌ను రెండు రోజులు ఆలస్యంగా అందుకొని, అనంతరం చికిత్స పొందాల్సి వస్తుంది.

పీహెచ్‌సీల్లోని ల్యాబ్‌ల్లో కెమికల్‌ లేని విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. కొనుగోలు కోసం తన నిధులు ఇస్తానని చెప్పారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగానే ఉన్నాం. ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తాం. వైద్యులు, సిబ్బంది కొరత విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.

– డాక్టర్‌ మధుసూదన్‌, జిల్లా వైద్యాధికారి

రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఆరోగ్యకేంద్రాల్లో చిన్నచిన్న పనులు, మౌలిక వసతులను కూడా వైద్యాధికారులు కల్పించలేకపోతున్నారు. ఒక్కో పీహెచ్‌సీకి ఏడాదికి జన్‌ ఆరోగ్య సమితి(జేఎఎస్‌) నుంచి రూ.1.50 లక్షలు నిధులను ప్రభుత్వం విడుదల చేసేది. గతేడాది, ఈ ఏడాది ఈ నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆస్పత్రుల్లో తాగునీటి శుద్ధి యంత్రాలు, ల్యాబ్‌లో కెమికల్స్‌ కొనుగోలు తదితర వసతులు కల్పించలేకపోతున్నారు.

జ్వరాలు, సీజనల్‌ వ్యాధుల విజృంభనను ఏఎన్‌ఎంలు గ్రామస్థాయిలో ముందస్తుగా గుర్తించి వైద్యులకు తెలియజేస్తారు. క్షేత్రస్థాయిలో వీరి సమాచారం కీలకం. జిల్లాలో 84 పోస్టులు ఉండగా 42 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

సోలార్‌ టెక్నీషియన్‌

శిక్షణ ప్రారంభం

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో సోమవారం సోలార్‌ టెక్నీషియన్‌ శిక్షణ కార్యక్రమాన్ని ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సోలార్‌ ఎనర్జీ రంగంలో నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లకు విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. శిక్షణ పొందుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం కృష్ణప్రసాద్‌, వీటీసీ మేనేజర్‌ నజీర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ మహేశ్‌, ట్రైనర్‌ జయంత్‌ పాల్గొన్నారు.

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో నేర నియంత్రణపై పోలీస్‌ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ సంకీర్త్‌ సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పనితీరు, పెండింగ్‌ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా పకడ్బందీగా విచారణ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్‌ (2.0)లో కేసుల వివరాలను సకాలంలో నమోదు చేసి నిరంతరం అప్‌డేట్‌ చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ మోసాలు, ఆర్థిక నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. గంజాయి రవాణా, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. పోలీస్‌స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల వ్యవస్థను విస్తరించి, రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్‌ స్పాట్లను గుర్తించి చర్యలు చేపట్టాలని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించారు. గ్రామస్థాయి పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి, విలేజ్‌ పోలీస్‌ అధికారులు ప్రజలతో మమేకమై ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం

జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్‌ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ ప్రజల నుంచి 17 ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతీ ఫిర్యాదును శ్రద్ధగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీస్‌ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలతో నేరుగా మాట్లాడి అవసరమైన సూచనలు జారీ చేశారు. ప్రజలు మధ్యవర్తులు లేదా పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని చెప్పారు. చట్టబద్ధంగా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజాదివస్‌ ద్వారా ప్రజల ఫిర్యాదులను నేరుగా స్వీకరించి, సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.

కాటారం మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన జంగిలి శ్రీనివాస్‌ దంపతులు దివ్యాంగులు. వీరికి ఉండడానికి ఇల్లు లేదు. ఇద్దరు దివ్యాంగులైనప్పటికీ ఎవరికి కూడా దివ్యాంగ పింఛన్‌ రావడం లేదు. జీవనోపాధి కోసం చిన్న దుకాణం ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి వచ్చారు. ఇందిరమ్మ ఇల్లు, పింఛన్‌తో పాటు జీవనోపాధి కోసం రుణం మంజూరుచేయాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. – భూపాలపల్లి అర్బన్‌

జిల్లాలో వారం రోజుల క్రితం జ్వరాల కేసులే నమోదు కాలేదు. ఇప్పుడు ఒక్కో పీహెచ్‌సీలో రోజుకు 10కి పైగా కేసులు నమోదవుతున్నాయి. తాడిచర్ల పీహెచ్‌సీకి సోమవారం ఒక్కరోజు 120 మంది రోగులు రాగా అందులో 12 మంది సీజనల్‌ జ్వరంతో బాధపడుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. రేగొండలో 14 మంది, జిల్లా ప్రధాన ఆస్పత్రిలో 14, ఒక్క చిట్యాల సీహెచ్‌సీలోనే 55 జ్వరం కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని పీహెచ్‌సీల్లో ఈ నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహించిన వారిలో 769 జ్వరాల కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించిన వారు సైతం ఉన్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక దోమల గుడ్లు, లార్వాలు పెరిగి డెంగీ కేసులు భారీ ఎత్తున నమోదవుతాయని నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తుగా అప్రమత్తమై మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది, మౌలిక వసతుల కొరత తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

ఇల్లు లేదు..

పింఛన్‌ లేదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement