యూనిఫామ్‌లు అందించాలి
భూపాలపల్లి అర్బన్: భూ భారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో లైసెన్స్‌డ్ సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రీసర్వేపై సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 91 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఈ నెల 20లోపు విధుల్లో చేరి రీసర్వేలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. గడువులోగా విధులకు హాజరుకాని సర్వేయర్ల లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. శాసీ్త్ర య పద్ధతిలో రీసర్వే నిర్వహించడం ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. జిల్లాలో తొలి దశలో ఏడు గ్రామాల్లో రీసర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి సర్వేయర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, లైసెన్స్‌డ్ సర్వేయర్లు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
ప్రజావాణిలో అందిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 71 దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికా రులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రతి అర్జీని నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్‌ఓ వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
జిల్లాలోని సంక్షేమ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌లను సకాలంలో అందించేందుకు కుట్టుపని ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ అధికారులతో యూనిఫాంల తయారీ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, డీఆర్‌డీఓ బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, ఎస్సీ అభివృద్ధి అధికారి సుకీర్తి జై భీం, మైనారిటీ సంక్షేమ అధికారులు నాగసాగర్, కుమారస్వామి, సంక్షేమ, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.


