సీఈఆర్‌ క్లబ్‌ కార్యదర్శిగా చంద్రశేఖర్‌ | - | Sakshi
Sakshi News home page

సీఈఆర్‌ క్లబ్‌ కార్యదర్శిగా చంద్రశేఖర్‌

Jul 13 2026 1:16 AM | Updated on Jul 13 2026 1:16 AM

భూపాలపల్లి అర్బన్‌: ఏరియా సీఈఆర్‌ క్లబ్‌ నూతన కార్యదర్శిగా కాపు చంద్రశేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ శ్యాంసుందర్‌ తెలిపారు. సీఈఆర్‌ క్లబ్‌ జనరల్‌ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించగా, క్లబ్‌ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కార్యదర్శి పదవికి కాపు చంద్రశేఖర్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయనను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా యు.శ్రీనివాస్‌, మధిర కొమరయ్య, క్రీడల కెప్టెన్‌గా పాక శ్రీనివాస్‌, సాంస్కృతిక కెప్టెన్‌గా ఆడిచెర్ల శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా జి.శ్రీనివాసరావు, ఆర్‌.శ్రీకాంత్‌, ఎండీ.తాజుద్దీన్‌, టి.చిరంజీవి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్లు విశ్రాంత్‌ కుమార్‌, సాయికృష్ణ, వంశీ, సందీప్‌, దీప పొద్దర్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ పర్స శ్రీనివాస్‌, గుర్తింపు సంఘం బ్రాంచ్‌ కార్యదర్శి మోటపలుకుల రమేష్‌, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు బేతెల్లి మధుకర్‌ రెడ్డి, వివిధ కార్మిక సంఘాల నాయకులు, సీఈఆర్‌ క్లబ్‌ సభ్యులు, క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement