గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం

Jul 10 2026 5:28 AM | Updated on Jul 10 2026 5:28 AM

భూపాలపల్లి: గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఐడీఓసీ కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి–ప్రణాళికలు అంశంపై చిట్యాల, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన అవగాహన సదస్సును కలెక్టర్‌ రాహుల్‌ శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలు ఆదాయ వనరులు సొంతంగా సమకూర్చుకోవాలని సూచించారు. గ్రామాల నుంచి దేశ, విదేశాలలో నివసిస్తున్న ప్రముఖులు ద్వారా గ్రామాలు అభివృద్ధికి నిధులు సమకూర్చుకోవాలని తెలిపారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు లీడ్‌ తీసుకోవాలన్నారు. అభివృద్ధికి మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement