● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
మహాముత్తారం: విధ్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని కేజీబీవీ పాఠశాలతో పాటు ఎస్టీ బాలుర వసతి గృహన్ని తనిఖీ చేశారు. వసతి గృహంలోని స్టాక్‌రూంలోని కూరగాయలు, పప్పుదినుసులు, బియ్యం పరిశీలించారు. విద్యార్థులను భోజన వసతులపై అడిగి తెలుసుకున్నారు. మండలకేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహంలో వసతులు లేకపోవడంతో పాటు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో కాటారం తరలివెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీఓ ప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్ కొండగొర్ల బాపు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


