న్యూస్‌రీల్
మండల విద్యావ్యవస్థను గాడిలో పెట్టాల్సిన మండల విద్యాశాఖ అధికారులు(ఎంఈఓ)లు జిల్లాలోని ఉన్నటువంటి 12 మండలాలలో ఇన్‌చార్జ్‌లే కొనసాగుతున్నారు. జిల్లాలో ఆయా మండలంలో ఉన్న ఉన్నత పాఠశాలల సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఇఓలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు పాఠశాల విధులు, మండల బాధ్యతలను కొనసాగిస్తున్నారు. అదనపు బాధ్యతలతో రెండు వైపులా సరైన న్యాయం చేయలేకపోతున్నారు. కార్యాలయ నిర్వహణ తప్ప పాఠశాలల పర్యవేక్షణ పూర్తిస్థాయిలో చేయలేకపోతున్నారు. వారి పాఠశాలలో కూడా విద్యార్థులకు విద్యను బోధించే అవకాశాన్ని కోల్పోతూ పాఠశాలలకు వెళ్లి సంతకాలు పెట్టి రావాల్సిన పరిస్థితులు దాపరించుకున్నాయి.
పాఠశాలలపై తనిఖీలే లేవు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలపై పర్యవేక్షణ కరువైంది. పర్యవేక్షణ లేకపోవడంలో ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజనతో గతంలో ఉన్నటువంటి డివిజన్ స్థాయి డిప్యూటీ ఈఓ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. డిప్యూటీ ఈఓలు వారి పరిధిలోని పాఠశాలలను తప్పని సరిగా బాధ్యతగా తనిఖీలు చేసేది. వారు కుడా లేకపోవడంతో పర్యవేక్షణ లేకుండా పోయింది. ఎంఈఓలు ఇన్‌చార్జ్‌లే కావడంలో పాఠశాలలు తనిఖీ చేసేందుకు దృష్టి సారించడం లేదు. తనిఖీలు చేసినా విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు.
పరీక్షలపై ప్రభావం
ఉన్నత అధికారి సమీక్ష సమావేశాలకు హాజరుకావడంతో పర్యవేక్షణ సరిగా చేయలేకపోతున్నారు. డీఈఓ సైతం ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. దీంతో నాలుగైదు ఏళ్లుగా పదో తరగతి ఫలితాలపై ప్రభావం పడుతుంది. ఎంఈఓలు ప్రాఽథమిక పాఠశాలల పర్యవేక్షణకే ప్రియారిటీ ఇస్తున్నారు. ఉన్నత పాఠశాలలపై డీఈఓ ఉన్నత పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలలపై పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ప్రతి ఏడాది ఫలి తాలు రాష్ట్ర స్థాయిలో జిల్లా వెనుకబడి పోతుంది.
ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం
జిల్లాలో విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు పాఠశాలలపై కన్నెత్తి కూడా చూడటం లేదు. విద్యార్థుల నుంచి వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా.. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడం లేదు. అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించడం లేదు. విద్యాసంస్థలను వ్యాపార సంస్థలుగా మార్చినా పట్టించుకోవడం లేదు.
రెగ్యులర్ అధికారులను
నియమించాలి..
విద్యాశాఖలో ఇన్‌చార్జ్ డీఈఓ, ఎంఈఓలు కొనసాగుతున్నారు. ప్రభుత్వం మండల, డివిజన్, జిల్లా విద్యాశాఖ రెగ్యులర్ అధికారులను నియమించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను నిరంతరం పర్యవేక్షించాలి. – కల్లోజు దిలీప్‌కుమార్,
బీఆర్‌ఎస్‌వీ జిల్లా నాయకులు
డీఈఓ, 12 మండలాల్లోనూ ఎంఈఓలు లేరు..
సీనియర్ ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలు
కొరవడిన పాఠశాలల పర్యవేక్షణ
జిల్లాలో పాఠశాలల వివరాలు
సహదేవుడు తప్పా.. అందరూ..
జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఒక్క సహదేవుడు తప్ప మిగితా అందరు డీఈఓలు ఇన్‌చార్జ్‌లే విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ఏర్పడిన తరువాత 2016 సంవత్సరంలో డీఈఓగా సహదేవుడు నియమితులయ్యారు. ఆయన బదిలీ అనంతరం తొమ్మిదేళ్లుగా ఇన్‌చార్జ్ డీఈఓలు కొనసాగుతున్నారు. వరంగల్ డీఈఓ నారాయణరెడ్డి, ములుగు సబ్ కలెక్టర్ గౌతమ్, వరంగల్ ఆర్జేడి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ డీఈఓ నారాయణరెడ్డి, హనుమకొండ డైట్ కళాశాల ప్రినిపాల్ మహ్మద్ అబ్దుల్‌హై, ములుగు డీఈఓ ఫణిని, ఏడీ శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్‌కుమార్, ప్రస్తుతం డీఈఓ కార్యాలయ ఏడీ రాజేందర్ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు.
జిల్లా విద్యాశాఖలో ఇన్‌చార్జ్‌ల పాలన రాజ్యమేలుతోంది. జిల్లావ్యాప్తంగా 12 మండలాల్లోనూ ఒక్కటంటే ఒక్క మండలంలోనూ శాశ్వత ఎంఈఓ లేకపోవడం విద్యావ్యవస్థ దుస్థితికి అద్దంపడుతోంది. సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా బాధ్యతలు అప్పగించి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో పాఠశాలల పర్యవేక్షణ లోపించడమే కాకుండా హెడ్మాస్టర్లపై అదనపు భారం పడుతోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా పోతోంది. జిల్లా విద్యావ్యవస్థను పర్యవేక్షించాల్సిన డీఈఓ సైతం ఇన్‌చార్జ్‌గానే కొనసాగుతున్నారు.
– భూపాలపల్లి అర్బన్


