గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

Jul 7 2026 1:01 AM | Updated on Jul 7 2026 1:01 AM

గణపురం: మండలకేంద్రంలోని కాకతీయు కళాక్షేత్రం గణపేశ్వరాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించగా భక్తులు పెద్దసంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.

ప్రమోషన్లు ఇవ్వాలని ధర్నా

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణిలో ఐదు సంవత్సరాల సేవ పూర్తి చేసిన సీనియర్‌ మైనింగ్‌ సర్దార్‌లకు వెంటనే ఓవర్‌మెన్‌ గ్రేడ్‌–బీ ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం భూపాలపల్లి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి మోటపలుకుల రమేష్‌ మాట్లాడుతూ.. ఓవర్‌మెన్‌ పోస్టులు ఖాళీ లేవని చెప్పి ప్రమోషన్లు నిలిపివేస్తూనే యాక్టింగ్‌ ఓవర్‌మెన్‌ విధులు చేయించడం అన్యాయమన్నారు. 2016–17 బ్యాచ్‌ అర్హులైన సీనియర్‌ మైనింగ్‌ సర్దార్‌లకు తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలని, జేఎంఈటీ సిబ్బందికి కూడా శిక్షణ పూర్తయిన వెంటనే షార్ట్‌ ఫైరర్‌ లేదా సర్దార్‌ ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, మైనింగ్‌ సిబ్బంది ఆసిఫ్‌పాషా, రామచందర్‌, సికిందర్‌సింగ్‌, రాయమల్లు, ఆఖిల్‌, రాజ్‌కుమార్‌, జగత్‌రావు, తిరుపతి, రాజేందర్‌, కరీముల్లా పాల్గొన్నారు.

అర్జీల పరిష్కారానికి కృషి

ఏటూరునాగారం: గిరిజన దర్బార్‌లో గిరిజనులు వివిధ సమస్యలపై అందించిన అర్జీలను పీఓ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌(ఎస్‌డీసీ) ప్రతాప్‌ తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆరు వినతులను ఆయన స్వీకరించారు. వెంకటాపురం(కె) మండలం నూగూరుకు చెందిన రైతులు భూములకు పట్టాలు ఇప్పించాలని కోరారు. కొత్తగూడ మండలం ఓటాయితండాకు చెందిన రైతులు పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇప్పించాలని వేడుకున్నారు. వెంకటాపురం(ఎం) అందుగులమీది గ్రామంలోని బూర్గుపేటకు రేషన్‌షాప్‌ ఇప్పించాలని స్థానికులు విన్నవించారు. ఏటూరునాగారం గిరిజన పాఠశాలలో 8వ తరగతి ఆడ్మిషన్‌ ఇప్ప ంచాలని గోవిందరావుపేట బుస్పాపురం గ్రా మానికి చెందిన గిరిజనుడు వేడుకున్నారు. కన్నాయిగూడెం మండలం సర్వాయి గ్రామానికి చెందిన మహిళ ఐటీడీఏ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసేందుకు అవకాశం ఇప్పించాలని కోరారు. వాజేడుమండలం పేరూరుకు చెందిన ఓ వ్యక్తి బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి ఉన్నానని ఏదైనా పాఠశాలలో నర్సు ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో డీటీ అనిల్‌, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్‌రావు, జియాలజిస్ట్‌ కిశోర్‌, పెసా కోఆర్డినేటర్‌ ప్రభాకర్‌, ఐటీఐ ప్రిన్సిపల్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్టీసీ కంట్రోలర్‌ శంకర్‌ పాల్గొన్నారు.

అంకితభావంతో

పనిచేయాలి

ములుగు రూరల్‌: పోలీసులు విధుల్లో అంకితభావంతో పని చేయాలని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సిబ్బందికి రెయిన్‌ కోట్లు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వర్షాకాలంలో విధులకు ఆటంకం కలగకుండా పోలీసులు విధులు నిర్వహించే విధంగా రెయిన్‌ కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురైతే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. అవసరమైతే నేరుగా తనను కలువచ్చని తెలిపారు. కింది స్థాయి సిబ్బందికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ సదానందం, ఆర్‌ఐ స్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement