
అంతులేని ఆదాయం.. పోస్టింగ్ కోసం పోటాపోటీ..
రవాణాశాఖలో అంతులేని ఆదాయం ఉండటంతో కొందరు అధికారులు పోటీపడి పోస్టింగ్‌లు కొడుతున్నారు. కొందరు మోటారు వెహికిల్ ఇన్‌స్పెకర్లు ఇప్పుడు ఇన్‌చార్జ్ డీటీఓలుగా కూడా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా కొన్నిచోట్ల సీనియర్‌లు తిరకాసు చేసి జూనియర్‌లను ముందుంచి తెరవెనుక అక్రమ ఆదాయమార్గాలపై చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టు కూడా ఖాళీ అయిన సమయంలో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్‌గా ఉన్న 1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఎంవీఐ డీటీఓగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే తెరపైన కీలక పోస్టులో ఉండటం ఇష్టం లేక అత నే ఆ పోస్టుపై విముఖత చూపడంతో 2012 బ్యా చ్‌కు చెందిన ఒకరికి ఆ పోస్టు కట్టబెట్టి ఆ సీనియ ర్ ఎంవీఐ అన్నీ తానై చూస్తుండటం వల్లే మా మూళ్లు రెండింతలయ్యాయన్న ఆరోపణలు ఉ న్నాయి. ఇదిలాఉంటే ఇన్‌చార్జ్‌ల కోసం అన్ని జిల్లాల్లో పోటీ ఉంది. వరంగల్‌లో ఎంవీఐగా ఉన్న ఒకరు మహబూబాబాద్ ఇన్‌చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తుండగా, పెద్దపల్లి ఎంవీఐగా ఉన్న ఓ అధికా రి ఆ పోస్టుతోపాటు ములుగు ఎంవీఐగా, ఇన్‌చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లిలో ఎంవీఐగా, ఇన్‌చార్జ్ డీటీఓగా ఒక్కరే చూస్తున్నారు. ఇలా.. ఏళ్లతరబడిగా ఉమ్మడి వరంగల్‌లో పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధి కారు ల తీరుపై ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నా రు. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కోరుకున్న పోస్టుల్లో కొనసాగుతున్నారంటున్నారు. కాగా,రవాణాశాఖలో పెచ్చుమీరుతున్న అవినీతిపై కొందరు అవినీతి నిరోధకశాఖ అధికా రులు కూడా ద్వంద్వ వైఖరితో ఉన్నారన్న చర్చ కూడా ఆ శాఖలో జరుగుతోంది. వ్యక్తిగత పరిచయాల ఆధారంగా లెక్కకు మించిన అవినీతి జరి గినా ఆ కార్యాలయాలు, అధికారులపై ఉదాసీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.