అంగరంగ వైభవంగా వేడుకలు | - | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా వేడుకలు

Aug 12 2025 8:05 AM | Updated on Aug 13 2025 4:52 AM

అంగరం

అంగరంగ వైభవంగా వేడుకలు

అసమగ్ర కొలువులు హామీలు నిలబెట్టుకోవాలి..

కుటుంబాల పోషణకు..

భూపాలపల్లి: స్వాతంత్య్ర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణ ఏర్పాట్ల్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమాల నిర్వహణ, సాంస్కృతిక ప్రదర్శనలు, భద్రతా ఏర్పాట్లు, వేదిక అలంకరణ తదితర అంశాలపై అధికారులకు కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు. అసెట్స్‌ పంపిణీకి లబ్ధిదారుల జాబితా తయారు చేయాలన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ క్రీడా మైదానంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాలకు షామియానా, కుర్చీలు, వైద్య కేంద్రం, అంబులెన్స్‌, తాగునీరు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్‌ అధికారులకు సూచించారు. వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై స్టాళ్ల ఏర్పాటుకు డీఆర్‌డీఓకు జాబితా ఇవ్వాలన్నారు. అన్ని కార్యక్రమాలు మినిట్‌ టు మినిట్‌ సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు ఆర్డీఓ పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదులు పరిష్కరించాలి..

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరి ష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 41మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. అనంతరం మాట్లాడుతూ.. దరఖాస్తులు నిశి తంగా పరిశీలించి పెండింగ్‌లో ఉంచకుండా సత్వర పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకాని అధికారులకు మెమోలు జారీచేయాలని కలెక్టరేట్‌ ఏఓను ఆదేశించారు. నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కల్లెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

నులి పురుగుల నివారణకు మాత్రలు

భూపాలపల్లి అర్బన్‌: 1–19 సంవత్సరాల వయసున్న పిల్లల్లో నులి పురుగుల నివారణకు తప్పనిసరి ఆల్బెండజోల్‌ మాత్రలు వేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని జంగేడు కేజీబీవీ పాఠశాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలలో ఈ మాత్రలు అందుబాటులో ఉన్నాయని పిల్లలందరికీ కేంద్రాలలో మాత్రలు తప్పకుండా ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, ఇన్‌చార్జ్‌ వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శ్రీదేవి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌, డాక్టర్‌ ఉమాదేవి పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా వేడుకలు1
1/1

అంగరంగ వైభవంగా వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement