
ఉన్నత చదువులు చదవాలి
● ఏటీడబ్ల్యూఓ క్షేత్రయ్య
కాళేశ్వరం: ఆదివాసీల పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ఏటీడబ్ల్యూఓ క్షేత్రయ్య అన్నారు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం వేడుకలను శనివారం మహదేవపూర్ మండలకేంద్రంలో ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలకేంద్రంలోని కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏటీడబ్ల్యూఓ క్షేత్రయ్య మాట్లాడుతూ ఆదివాసీల పిల్లలు విద్యని అభ్యసించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరారు. ఆదివాసుల కోసం ప్రత్యేక గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, ఆదివాసీ జెఏసీ అధ్యక్షుడు గురుసింగ బాపు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు మడే కుమార్, ఐటీడీఏ సాధన సమితి అధ్యక్షుడు సమ్మయ్య, పీసీసీ సభ్యుడు బెల్లంకొండ కిష్టయ్య, జీసీసీ డైరెక్టర్‌లు రాములు, వెంకటరాజం, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, ఆదివాసీ గిరిజన సంక్షేమ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఉన్నత చదువులు చదవాలి