
కలెక్టర్‌ను సన్మానించిన టీఎన్జీవోస్ నాయకులు
భూపాలపల్లి అర్బన్: సంపూర్ణత అభియాన్‌లో భాగంగా గవర్నర్ చేతుల మీదగా అవార్డు అందుకున్న సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మను మంగళవారం టీఎన్జీవోస్ నాయకులు సన్మానించారు. మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి పూల మొక్కను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బూరుగు రవి, దశరథం, షఫి, జ్ఞానేశ్వర్‌సింగ్, సత్యనారాయణ, శ్రీదేవి, కిరణ్‌కుమార్, శంకరయ్య, సభ్యులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా రాజేంద్రప్రసాద్
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ రాజేంద్రప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్‌కుమార్‌కు పదోన్నతి రావడంతో జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు బదిలీపై వెళ్లారు. దీంతో భూపాలపల్లి మెడికల్ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది సూపరింటెండెంట్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందించారు.

కలెక్టర్‌ను సన్మానించిన టీఎన్జీవోస్ నాయకులు