పాలకుర్తి టౌన్: ప్రజా పంపిణీ వ్యవస్ధను బలో పేతం చేసి తెల్ల రేషన్‌కార్డుదారులకు 16 రకాల నిత్యావసర వస్తువులను అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సింగారపు రమేశ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవా రం మండల కేంద్రంలో ఆ సంఘాల సమావేశం శ్రీసోమేశ్వర ఫంక్షన్‌హాల్‌లో బచ్చు శ్రీలత అధ్యక్షతన జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 10న నిర్వహించే జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చందూనాయక్ సోమ సత్యం, మదార్, నాగయ్య పాల్గొన్నారు.


