నిమ్మమాలల అలంకరణలో రేణుకా ఎల్లమ్మ | - | Sakshi
Sakshi News home page

నిమ్మమాలల అలంకరణలో రేణుకా ఎల్లమ్మ

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

జనగామ: ఆషాఢమాసం మూడో మంగళవారం సందర్భంగా పట్టణంలోని 3వ వార్డు బాలాజీ నగర్‌ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల మాలలతో విశేష అలంకరణ చేయగా, భక్తులు దర్శించుకున్నారు. ఆలయ పూజారి మారుపాక శ్యాంప్రసాద్‌ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేశారు. ప్రకృతి ప్రసాదమైన నిమ్మకాయలో శుద్ధి, రక్షణ, శుభశక్తులు ఉన్నాయని, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభం కలుగుతాయన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం మహిళలు ఆషాఢమాస గోరింటాకు వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో దూడల శోభారాణి, లగిశెట్టి పద్మావతి, దోసపాటి శ్రీలక్ష్మి, మంజుల, రఅనిత, కవిత, విజ య, సునీత, జ్యోతి, సుజాత, శోభా, సుజాత, నిషిత, స్వాతి, వీణ, భాగ్య, ఆలేటి పద్మ, రేణుక, ప్రవీణ, కళావతి, సతైమ్మ, సరళ, రజిని తదితరులు పాల్గొన్నారు.

రేపు జిల్లాకు రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌

జనగామ రూరల్‌: ఈ నెల 6వ తేదీన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గద్వాల విజయలక్ష్మి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని కోర్టు సమీపంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకోనున్నారు. 9:45 నుంచి 10 గంటల వరకు బాలల వసతి గృహం, సఖి కేంద్రాన్ని సందర్శించి సేవలను పరిశీలిస్తారు. 10 గంటల నుంచి 10:30 గంటల వరకు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని సందర్శించి 10:45 వరకు కలెక్టరేట్‌కు చేరుకొని, గౌరవ వందనం స్వీకరిస్తారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కలెక్టర్‌ కార్యాలయంలోని మహిళల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 12 గంటల నుంచి 2 గంటల వరకు పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకొని జనగామకు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం 2:30 గంటల నుంచి 4 గంటల వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, మహిళల సంక్షేమం, భద్రత, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారు. 5 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరివెళ్తారు.

దోస్త్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ఫేజ్‌

అడ్మిషన్లు ప్రారంభం

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి గాను చివరి అవకాశంగా దోస్త్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ఫేజ్‌ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్‌ లెఫ్ట్‌నెంట్‌ ప్రొఫెసర్‌ చంద్రమౌళి తెలిపారు. కళాశాలలో మంగళవారం ఆయన మాట్లాడారు.. కళాశాలలో అడ్మిషన్ల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ ఈనెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు చేసుకోవాలని, వెబ్‌ ఆప్షన్లు 6 నుంచి 12వ తేదీ వరకు పెట్టుకోవాలన్నారు. ఈనెల 14న సీట్‌ అలాట్‌మెంట్‌ జరుగుతుందని, ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 14వ తేదీ నుంచి 18వరకు చేసుకోవాలన్నారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసిన విద్యార్థులు కళాశాలలో కాలేజ్‌ రిపోర్టింగ్‌ 17వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తప్పనిసరిగా కళాశాలకు వచ్చి రిపోర్టు చేయాలన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్‌ ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ లైఫ్‌ సైన్స్‌, బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని, అన్ని కోర్సులకు కంప్యూటర్‌సైన్స్‌ ఉందన్నారు. విద్యార్థులు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దోస్త్‌ ద్వారా డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందాలని సూచించారు.

ఆయుష్‌ వైద్య విద్యార్థుల

నిరవధిక సమ్మె ఆరంభం

కాశిబుగ్గ: ఆయుష్‌ హౌస్‌ సర్జన్లు ఆస్పత్రుల్లో ప్రతీరోజు ఓపీ, ఐపీ సేవలు, ఇతర అత్యవసర సేవలు, పేషెంట్ల పర్యవేక్షణ, క్లినికల్‌ విధులు, నైట్‌ డ్యూటీల బాధ్యతలను అల్లోపతిక్‌ వారితో సమానంగా నిర్వహిస్తున్నప్పటికీ స్టైఫండ్‌ చెల్లింపులో మాత్రం తీవ్ర వివక్ష చూపుతున్నారంటూ వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి వరంగల్‌ హౌస్‌ సర్జన్లు ఆందోళనబాట పట్టారు. తెలంగాణ ఆయుష్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారంనుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ప్రస్తుతం తెలంగాణ ఆయుష్‌ హౌస్‌ సర్జన్లకు నెలకు రూ.13,754 మాత్రమే స్టైఫండ్‌ చెల్లిస్తుండగా, అల్లోపతిక్‌ హౌస్‌ సర్జన్లకు మాత్రం రూ.29,972 ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పరిధిలో పేషెంట్లకు ఒకే విధమైన సేవలు అందిస్తున్నప్పటికీ ఇంత వ్యత్యాసం కూడుకుని ఉండటం రాజ్యాంగం ప్రకారం సమానత్వ హక్కుకు విరుద్ధమని ఆవేధన వెలిబుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement