మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మంగళవారం ‘సై అంటే సై.. మీరా.. నేనా’ అన్నట్టుగా మూడు గొర్రె పోతుల కొట్లాట అందరినీ ఆకర్షించింది. ఎమ్మె వీరయ్య అనే గొర్రెల పెంపకందారుని గొర్రెల మందలో ఉన్న మూడు గొర్రె పోతుల్లో రెండు ఒకవైపు ఒక్కటి ఒకవైపు తలలను గుద్దుకుంటుండగా పెంపకందారు వాటిని విడిపించేందుకు నానా తంటాలు పడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులంతా వాటి కొట్లాటను చూస్తూ ఉండిపోయారు. ఎట్టకేలకు ఒక గొర్రెను కాపరి పక్కకు తప్పించగా మిగిలిన రెండు కొట్లాడుకుంటూనే మందలో కలిసి వెళ్లిపోయాయి.
– లింగాలఘణపురం


