అధికారం కోల్పోయిన అక్కసుతోనే ఆరోపణలు | - | Sakshi
Sakshi News home page

అధికారం కోల్పోయిన అక్కసుతోనే ఆరోపణలు

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

లింగాలఘణపురం: అధికారం కోల్పోయిన అక్కసుతోనే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని సిరిపురంలో సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో నదులు, రిజర్వాయర్‌లలో నీళ్లు లేవని, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలో గోదావరిలో నీళ్లు ఎత్తిపోసి రైతులకు సాగునీరు ఇవ్వాలని అసత్యపు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో తహసీల్దార్‌ అండాలు, సర్పంచ్‌లు ఎడ్లలావణ్యరాజు, మల్లారెడ్డి, సంపత్‌, విష్ణు, బుచ్చయ్య, సదానందం, రాజు, పీఏసీఎస్‌ చైర్మన్లు ఉపేందర్‌, శ్రీశైలం, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ శివకుమార్‌, డైరెక్టర్లు శ్రీలతారెడ్డి, మోహన్‌, సిరిపురంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు విజయ్‌మనోహర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement