ఏనెబావిలో ‘పాల’ఊట! | - | Sakshi
Sakshi News home page

ఏనెబావిలో ‘పాల’ఊట!

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

లింగాలఘణపురం: ఏనెబావి అంటేనే ఒకప్పుడు సేంద్రియ వ్యవసాయానికి మారుపేరుగా ఉండేది. కాలక్రమంలో ఆ వ్యవసాయ విధానాన్ని వదిలి నేడు పాడి పరిశ్రమకు నిలయంగా మారింది. మండలంలోని పిట్టలోనిగూడెం గ్రామ పంచాయతీ శివారు గ్రామమైన ఏనెబావిలో 45 కుటుంబాలు ఉండగా, సుమారు 200లకు పైగా ఆవులు ఉన్నాయి. వీటితో నేడు రోజుకు 600 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి ఇంటికీ ఐదు నుంచి ఆరు పాడి ఆవులు ఉంటాయి. ప్రతీ రైతు పొలం వద్ద తప్పకుండా నేపియర్‌ గడ్డి ఉంటుంది. ఉదయం, సాయంత్రం పాలను పితికి కొంతమంది ప్రైవేట్‌ డెయిరీకి పోయగా మరికొంత మంది విజయ డెయిరీకి పోస్తున్నారు. గ్రామంలో కరుణాకర్‌ అనే రైతు మొదట రెండు పాడి ఆవులను జెర్సీ, హెచ్‌ఎఫ్‌ రకాలను కొనుగోలు చేశాడు. దీంతో అతడి ఆదాయం, నిర్వహణ చూసిన గ్రామస్తులు ఒక్కొక్కరు పాడి ఆవులను కొనుగోలు చేసుకోవడం, పాలను ఉత్పత్తిని పెంచడం మొదలుపెట్టారు. ఇలా గ్రామంలో పాడిపరిశ్రమ వారికి పెద్ద ఉపాధిగా మారింది.

గ్రామంలో ఇంటింటికీ

ఐదారు పాడి ఆవులు..

పాడిపరిశ్రమే గ్రామస్తుల ప్రధాన ఉపాధి

45 కుటుంబాలు..

రోజుకు 600లీటర్ల పాల ఉత్పత్తి

రోజుకు 30 లీటర్ల పాలు పోస్తా..

రోజుకు 30 లీటర్ల పాలు పోస్తా.. నాకు పది ఆవులు ఉన్నాయి. అందులో కొన్ని ప్రస్తుతం పాలు ఇస్తున్నాయి. మరికొన్ని సూడికి ఉన్నాయి. పాడితో ఉపాధి మంచిగానే ఉంది. దాణా ఖర్చులు బాగా పెరిగాయి. పాల రేటును పెంచితే మరింత బాగుంటుంది. –పొన్నాల శ్రీనివాస్‌, పాడి రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement