పార్టీని మరింత బలోపేతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పార్టీని మరింత బలోపేతం చేయాలి

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయం

ప్రారంభం

జనగామ రూరల్‌: ప్రభుత్వం అమలు చేస్తున్న్ద అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి లక్ష్మినారాయణ నాయక్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్‌ సమీపంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్‌ హాజరయ్యారు. ఈసందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ..పార్టీ కార్యకలాపాలకు జిల్లా కార్యాలయం కేంద్రబిందువుగా నిలుస్తుందన్నారు. ప్రతీ ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి, కౌన్సిలర్లు, రాష్ట్ర కమిటీ నాయకులు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement