జనగామ: జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్‌లో ఉన్న భవనంలో కొనసాగుతున్న కెనరా, డీసీసీ బ్యాంకు శాఖలు ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించి భవనాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు బ్యాంకుల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయా యి. ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా కెనరా బ్యాంకు అధికారులు శాఖ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసర సేవల కోసం లింగాలఘణపురం మండలం నెల్లుట్ల శాఖను సంప్రదించాలని, వివరాలకు– 701 3203331ను సంప్రదించాలని మేనేజర్ కోరారు. అలాగే డీసీసీ బ్యాంకు ఖాతాదారులు రఘునాథపల్లి, దేవరుప్పుల శాఖలను వినియోగించుకోవాలని, అవసరమైతే–9701361879కు సంప్రదించాలని సూచించింది. ఇదిలా ఉండగా, అత్యవసర నగదు అవసరాల కోసం డీసీసీ బ్యాంకు వద్ద మొబైల్ మినీ ఏటీఎంను ఏర్పాటు చేసి రోజుకు రూ.20 వేల వరకు నగదు డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.


